బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,749+2.09%
NIFTY25,735+2.01%
22K₹1,11,635/10g+0.25%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

జాతీయ వార్తలు

ఆర్. కృష్ణయ్యకు మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు ప్రదానం బీసీల హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకుడు ఆర్. కృష్ణయ్య

-శాసనమండలి ప్రతి పక్షనేత మధుసూదనా చారి రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17: బీసీల హక్కులు, ప్రయోజనాల సాధన కోసం దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్

nagendraబుధవారం, 18 నవంబర్ 2026 · 6:15 AM19 వీక్షణలుtrinetnews.com
ఆర్. కృష్ణయ్యకు మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు ప్రదానం బీసీల హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకుడు ఆర్. కృష్ణయ్య

-శాసనమండలి ప్రతి పక్షనేత మధుసూదనా చారి

రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17:

బీసీల హక్కులు, ప్రయోజనాల సాధన కోసం దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్యకు మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు ప్రదానం చేశారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధి, వారి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం ఉద్యమిస్తూ సామాజిక చైతన్యానికి కృషి చేస్తున్న గొప్ప ఉద్యమకారుడిగా వక్తలు ఆయనను కొనియాడారు.

మంగళవారం రాత్రి రవీంద్రభారతిలో శ్రుతిలయ ఫౌండేషన్, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పురస్కార ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ, బీసీల గొంతుకగా దశాబ్దాలుగా వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఆర్. కృష్ణయ్య నిజమైన సామాజిక ఉద్యమకారుడని ప్రశంసించారు. ఆయనను అభినవ జ్యోతిరావు పూలేగా అభివర్ణించారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ సంస్థ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా మాట్లాడుతూ, బీసీ, బహుజనుల రాజ్యాధికార సాధన దిశగా ఆర్. కృష్ణయ్య మరింత పట్టుదలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు పాలనలో భాగస్వామ్యం కల్పించే అవకాశాలు రావాలని పేర్కొన్నారు. కార్యక్రమానికి తొలుత శ్రుతిలయ ఫౌండేషన్ కార్యదర్శి ఆమని విచ్చేసిన అతిథులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, దైవజ్ఞ శర్మ, జితేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. వేదమంత్రోచ్చారణల నడుమ ఆర్. కృష్ణయ్యను ఘనంగా సత్కరించి మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డును అందజేశారు. అవార్డు ప్రదానోత్సవానికి ముందు నిర్వహించిన సీల్ వెల్ సినీ సుస్వరాలు, సంగీత విభావరి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ గాయని ఆమని సారథ్యంలో గాయకులు, గాయనీమణులు వైవిధ్యభరితమైన మధుర గీతాలను ఆలపించి ఆహుతులను ఉల్లాసపరిచారు. ఆద్యంతం సంగీత వినోదంతో, ఆత్మీయ సత్కారాలతో కార్యక్రమం సందడిగా సాగింది.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :