బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,749+2.09%
NIFTY25,735+2.01%
22K₹1,11,635/10g+0.25%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

జాతీయ వార్తలు

ప్రతి ఇంటికి, ప్రతి రైతుకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత: భట్టి విక్రమార్క

నవంబర్ 11న రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి 6,088 మెగావాట్లు.. యాదాద్రి విద్యుత్ కేంద్రం నుంచే 2,754 మెగావాట్ల ఉత్పత్తి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రతి రైతుకు నాణ్యమైన, నిరంతరాయ వ

nagendraబుధవారం, 18 నవంబర్ 2026 · 6:07 AM12 వీక్షణలుtrinetnews.com
ప్రతి ఇంటికి, ప్రతి రైతుకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత: భట్టి విక్రమార్క

నవంబర్ 11న రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి 6,088 మెగావాట్లు.. యాదాద్రి విద్యుత్ కేంద్రం నుంచే 2,754 మెగావాట్ల ఉత్పత్తి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17:

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రతి రైతుకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నవంబర్ 11న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,088 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నమోదైందని భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఒక్కటే 2,754 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసిందని పేర్కొన్నారు.

యాదాద్రి కేంద్రంలో 4,000 మెగావాట్ల ఉత్పత్తే లక్ష్యం

యాదాద్రి విద్యుత్ కేంద్రంలోని ఐదు యూనిట్ల ద్వారా పూర్తి స్థాయిలో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇందుకోసం నిరంతర బొగ్గు సరఫరాతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు.

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు ప్రణాళిక

రాష్ట్రంలో పారిశ్రామిక, వ్యవసాయ, గృహ విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణవ్యాప్తంగా ప్రతి ప్రాంతానికి నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విద్యుత్ రంగాన్ని మరింత పటిష్టం చేయడం, ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం, ప్రజలకు నిరంతర విద్యుత్ అందించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :