బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,903+2.28%
NIFTY25,732+2.00%
22K₹1,12,812/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

జాతీయ వార్తలు

బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు అలవాటు పడింది’.. -టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు

nagendraఆదివారం, 18 అక్టోబర్ 2026 · 2:30 AM19 వీక్షణలుtrinetnews.com
బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు అలవాటు పడింది’.. -టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు
  • హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 17

  • : బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు అలవాటు పడిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. బీజేపీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రతిసారీ విదేశీ శక్తులను తెరపైకి తెస్తోందని మండిపడ్డారు. చైనా భూ ఆక్రమణపై మాట్లాడే దమ్ము మోదీకి లేదన్నారు. రోహింగ్యాల పేరుతో దేశ ప్రజల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. దొరికితే దొంగ అన్నట్లుంది బీజేపీ తీరు అంటూ మండిపడ్డారు. ఈడీ దాడులు కేవలం ప్రతిపక్ష పార్టీ నేతలపైనే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఎన్నిక పక్రియ నిబంధనలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎందుకు మార్చారని, కమిటీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను ఎందుకు తొలగించారని పీసీసీ చీఫ్ నిలదీశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ ఎన్నికైన రోజే ప్రమాదాన్ని గురించి రాహుల్ గాంధీ హెచ్చరించారని గుర్తుచేశారు. ‘మీరు ప్రజల మద్దతుతో గెలవలేరు.. అందుకే ఓటు దొంగతనానికి పాల్పడ్డారు’ అంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు. పెద్ద రాష్ట్రాలలో ఓట్ల దొంగతనం ఎక్కువగా జరుగుతోందని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సీపీఎం మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నామని మహేశ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో సీపీఎం కలసి పనిచేస్తోందని చెప్పారు. నేటి సీపీఎం పోలిట్‌బ్యూరో మీటింగ్ తర్వాత వారి నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారన్నారు. ఇండియా కూటమిలోని అన్ని పార్టీల మద్దతు కూడగడతామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :