బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,716+2.05%
NIFTY25,768+2.14%
22K₹1,12,787/10g+1.24%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

జాతీయ వార్తలు

నౌకాదళంలోకి స్వదేశీ బహుళ ప్రయోజన నౌక ‘సమర్థక్‌’ అక్టోబర్‌ 16న కార్వార్‌లో ప్రవేశపెట్టనున్న భారత నౌకాదళం

nagendraబుధవారం, 14 అక్టోబర్ 2026 · 1:45 AM5 వీక్షణలుtrinetnews.com
నౌకాదళంలోకి స్వదేశీ బహుళ ప్రయోజన నౌక ‘సమర్థక్‌’ అక్టోబర్‌ 16న కార్వార్‌లో ప్రవేశపెట్టనున్న భారత నౌకాదళం

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 13: స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన బహుళ ప్రయోజన యుద్ధనౌక ‘సమర్థక్‌’ను భారత నౌకాదళం అక్టోబర్‌ 16న కర్ణాటకలోని కార్వార్‌ నౌకాదళ స్థావరంలో అధికారికంగా సేవల్లోకి ప్రవేశపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వ ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా లార్సెన్‌ అండ్‌ టూబ్రో సంస్థ నిర్మించిన ఈ నౌక, నౌకాదళంలో చేరనున్న నాలుగు బహుళ ప్రయోజన నౌకల్లో మొదటిది.

రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా ‘సమర్థక్‌’ ప్రవేశం మరో కీలక మైలురాయిగా నిలవనుంది. వ్యూహాత్మకంగా ప్రాధాన్యమున్న కార్యకలాపాల్లో వివిధ అవసరాలకు ఉపయోగపడే నౌకగా ఇది సేవలందించనుంది.

ప్రధానంగా సముద్ర నిఘా, గస్తీ కోసం రూపొందించిన ‘సమర్థక్‌’ తక్కువ తీవ్రత గల సముద్ర కార్యకలాపాలను కూడా నిర్వహించగలదు. లక్ష్యాల మోహరింపు, పరీక్షలకు వేదికగా, మానవరహిత, స్వయంచాలిత వ్యవస్థలకు మాతృనౌకగా పనిచేసే సామర్థ్యం దీనికి ఉంది.

మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యల్లోనూ ఈ నౌకను వినియోగించవచ్చు. అవసరమైనప్పుడు పరిమిత వైద్య సేవలందించే ఆసుపత్రి నౌకగా మార్చుకునే సౌలభ్యం ఉంది. సముద్రంలో ప్రమాదానికి గురైన నౌకల రక్షణ, వెలికితీత కార్యకలాపాలకు కూడా తోడ్పడనుంది.

సవాళ్లతో కూడిన సముద్ర వాతావరణంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు అనువుగా స్వదేశీ సెన్సర్లు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలను సమగ్ర పోరాట వ్యవస్థలో అనుసంధానించారు.

‘సమర్థక్‌’ చిహ్నంలో అలల నుంచి బయటకు వస్తున్న భారతీయ ఏనుగును చిత్రించారు. ఇది నౌక బలం, తెలివితేటలు, చురుకుదనానికి ప్రతీకగా నిలుస్తోంది.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :