బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,881+2.25%
NIFTY25,800+2.27%
22K₹1,12,510/10g+1.04%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

జాతీయ వార్తలు

ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

nagendraఆదివారం, 11 అక్టోబర్ 2026 · 1:21 AM5 వీక్షణలుtrinetnews.com
ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 10 :

సీఈసీ రాజీనామా, ‘సర్’ ప్రక్రియ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. రాజ్యాంగబద్ధ సంస్థను రాజకీయాలతో ముడిపెట్టడం, వ్యక్తిగత విమర్శలు సరికాదన్నారు. నిరాధార ఆరోపణలతో సీఈసీ, ప్రధాని రాజీనామా చేయాలనే డిమాండ్ సమంజసం కాదని చెప్పుకొచ్చారు. ఓట్లు మూకుమ్మడిగా తొలగించారనేది అపోహ మాత్రమే అని స్పష్టం చేశారు. గెలిస్తే తమ ఘనత అని.. ఓడిపోతే ఈవీఎమ్‌లను నిందించడం హాస్యాస్పదమంటూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.

ప్రపంచంలోకెళ్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని వెంకయ్య అన్నారు. దేశాన్ని కించపరిచే ప్రయత్నం చేయొద్దన్నారు. ఇప్పటికే కొన్ని పాశ్చాత్య పశ్చిమ దేశాలు.. భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నాయని తెలిపారు. ‘మన దేశంలో జరిగే వ్యవస్థను మనమే అవహేళన చేయడం మంచికాదు’ అని అన్నారు. సీఈసీ నియామకంలో సీజేఐ ఉండటం సరైంది కాదన్నారు. ఓట్లను ఏఐ ద్వారా తొలగించేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని.. అసలు ఏఐని ఉపయోగించడం లేదని స్పష్టం చేశారు.

భారతదేశం దివాళా తీసిందని.. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆరోపించారని మాజీ ఉపరాష్ట్రపతి అన్నారు. ఆ వ్యాఖ్యలతో కోపంతో పాటు ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పారు. అయితే మరుసటి రోజే ప్రపంచంలోకల్లా అతి వేగంగా ముందుకు వెళ్తున్న ఆర్థిక వ్యవస్థ భారతదేశం అంటూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రకటన ఇచ్చిందని అన్నారు. ఈ ఖ్యాతి కేవలం ప్రధాని మోదీది మాత్రమే కాదని ప్రజలదని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :