బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,881+2.25%
NIFTY25,800+2.27%
22K₹1,12,510/10g+1.04%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

జాతీయ వార్తలు

గణాంక పరిశోధన, సమాచార విశ్లేషణలో సహకారానికి ఒప్పందం పహ్లే ఇండియా ఫౌండేషన్‌తో చేతులు కలిపిన జాతీయ గణాంక కార్యాలయం

nagendraగురువారం, 8 అక్టోబర్ 2026 · 12:34 PM6 వీక్షణలుtrinetnews.com
గణాంక పరిశోధన, సమాచార విశ్లేషణలో సహకారానికి ఒప్పందం పహ్లే ఇండియా ఫౌండేషన్‌తో చేతులు కలిపిన జాతీయ గణాంక కార్యాలయం

న్యూఢిల్లీ, అక్టోబరు 8 (ట్రైనెట్ న్యూస్):

అధికారిక గణాంకాలు, పరిశోధన, సమాచార విశ్లేషణ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసేందుకు జాతీయ గణాంక కార్యాలయం న్యూఢిల్లీకి చెందిన పహ్లే ఇండియా ఫౌండేషన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ కార్యాలయం సామర్థ్యాల పెంపు, విజ్ఞాన మార్పిడిలోనూ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయనుంది.

మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్‌ సౌరభ్‌ గార్గ్‌, డైరెక్టర్‌ జనరల్‌ పీఆర్‌ మేష్రామ్‌, ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌, ప్రధాన గణాంక నిపుణుడు ఆశిష్‌ కుమార్‌ సమక్షంలో ఒప్పందం కుదిరింది. మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ సునీత భాస్కర్‌, ఫౌండేషన్‌ కార్యనిర్వాహక సంచాలకుడు రవి పోఖర్నా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

పరస్పర ఆసక్తి ఉన్న అంశాల్లో పరిశోధన, సమాచార విశ్లేషణ, సామర్థ్యాల పెంపు, విజ్ఞాన మార్పిడికి ఈ ఒప్పందం విస్తృత కార్యాచరణ చట్రాన్ని అందిస్తుంది. మంత్రిత్వ శాఖ ప్రాధాన్యాలకు అనుగుణంగా నిర్దిష్ట ఉమ్మడి కార్యక్రమాలను చేపట్టనున్నారు. కార్యక్రమంలో మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, పహ్లే ఇండియా ఫౌండేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :