బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,716+2.05%
NIFTY25,768+2.14%
22K₹1,12,787/10g+1.24%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

జాతీయ వార్తలు

హైదరాబాద్‌–విజయవాడ NH-65 విస్తరణ పనులను వేగవంతం చేయాలి ఎన్హెచ్ఏఐ ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌ను కోరిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

nagendraబుధవారం, 14 అక్టోబర్ 2026 · 1:19 AM5 వీక్షణలుtrinetnews.com
హైదరాబాద్‌–విజయవాడ NH-65 విస్తరణ పనులను వేగవంతం చేయాలి ఎన్హెచ్ఏఐ ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌ను కోరిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

* 2026 నవంబర్ 11 వరకు టెండర్ల దాఖలుకు గడువు.. 2027 జనవరి నాటికి పనులు ప్రారంభిస్తామని NHAI ఛైర్మన్ హామీ

* ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ రద్దీ తగ్గింపునకు ఆరు లేన్ల విస్తరణ కీలకం

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 12: హైదరాబాద్‌–విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారి-65 (ఎన్హెచ్-65) విస్తరణ పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా ప్రారంభించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌ను కోరారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ఎన్హెచ్ఏఐ

ఛైర్మన్‌తో పాటు సభ్యులు (ప్రాజెక్టులు) విప్నేష్ శర్మతో మంత్రి సమావేశమై ఈ కీలక ప్రాజెక్టుపై చర్చించారు.

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు అత్యంత కీలకమైన ఈ జాతీయ రహదారిపై రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ, తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారి విస్తరణకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, నిర్మాణ పనులను ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని NHAI అధికారులను కోరారు.

నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లు+2సర్వీస్ రోడ్లు విస్తరణ

ప్రతిపాదిత ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్లుగా విస్తరించడంతో పాటు, ఇరువైపులా సర్వీస్ రోడ్లు, నియంత్రిత ప్రవేశ సౌకర్యాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఈ విస్తరణ పూర్తయితే వాహనాల రాకపోకలు సులభతరమవడంతో పాటు ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రమాదాల నివారణకు, రహదారి భద్రతను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని వివరించారు.

2027 జనవరి నాటికి పనులు ప్రారంభిస్తాం: ఎన్హెచ్ఏఐ ఛైర్మన్

మంత్రి విజ్ఞప్తిపై స్పందించిన

ఎన్హెచ్ఏఐ ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్, ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ల దాఖలుకు 2026 నవంబర్ 11 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. 2027 జనవరి నాటికి పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

ప్రజల ప్రాణాల భద్రతే ప్రాధాన్యం

హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి వేలాది మంది ప్రయాణికులు, వాహనదారులకు నిత్యం కీలక రవాణా మార్గంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ మార్గంలో ప్రమాదాలను తగ్గించి, ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా విస్తరణ పనులను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని స్పష్టం చేశారు.

రహదారుల అభివృద్ధి అంటే కేవలం ప్రయాణ సౌకర్యాలను పెంచడమే కాకుండా, ప్రజల ప్రాణాలను కాపాడటం, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమివ్వడం, తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేయడం కూడా అని మంత్రి పేర్కొన్నారు. ఎన్హెచ్-65 విస్తరణ పనులు సకాలంలో పూర్తయ్యేలా కేంద్ర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకుంటామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →