E-Paperఈ-పేపర్PDF · Clip · Archive
భాషలు

ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం23 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:05 amసూర్యాస్తమయం 6:11 pm

బుధవారం

23 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:05 am

సూర్యాస్తమయం 6:11 pm

SENSEX74,837+0.70%
NIFTY23,428+0.68%
హైదరాబాద్ 22K₹1,43,211/10g-1.54%
హైదరాబాద్ 24K₹1,56,230/10g-1.54%
వెండి₹2,19,214/kg-0.92%

జాతీయ వార్తలు

దక్షిణ మధ్య రైల్వేలో తొలిసారిగా ‘కవచ్ 4.0’ ప్రారంభం

దక్షిణ మధ్య రైల్వేలో తొలిసారిగా ‘కవచ్ 4.0’ ప్రారంభం రైల్వే భద్రతలో మరో కీలక మైలురాయి మల్కాజిగిరి–కామారెడ్డి సెక్షన్‌లో 108 రూట్ కిలోమీటర్ల మేర అప్‌గ్రేడ్ మరింత ఖచ్చితమైన లొకేషన్ గుర్తింపు.. మెరుగైన సిగ్నల్ సమాచారం న్యూఢి

Staff Reporter23 September 2026, 7:27 AM6 చూసులుtrinetnews.com
దక్షిణ మధ్య రైల్వేలో తొలిసారిగా ‘కవచ్ 4.0’ ప్రారంభం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

దక్షిణ మధ్య రైల్వేలో తొలిసారిగా ‘కవచ్ 4.0’ ప్రారంభం

రైల్వే భద్రతలో మరో కీలక మైలురాయి

మల్కాజిగిరి–కామారెడ్డి సెక్షన్‌లో 108 రూట్ కిలోమీటర్ల మేర అప్‌గ్రేడ్

మరింత ఖచ్చితమైన లొకేషన్ గుర్తింపు.. మెరుగైన సిగ్నల్ సమాచారం

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 23:

రైల్వే భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా భారతీయ రైల్వే మరో కీలక మైలురాయిని సాధించింది. దక్షిణ మధ్య రైల్వే (SCR)లో తొలిసారిగా ‘కవచ్ వెర్షన్ 4.0’ వ్యవస్థను విజయవంతంగా ప్రారంభించింది. హైదరాబాద్ డివిజన్ పరిధిలోని మల్కాజిగిరి–కామారెడ్డి సెక్షన్‌లో 108 రూట్ కిలోమీటర్ల మేర ఇప్పటికే అమల్లో ఉన్న కవచ్ వెర్షన్ 3.2ను అధునాతన వెర్షన్ 4.0కు అప్‌గ్రేడ్ చేసింది.

భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లోని విభిన్న నిర్వహణ, సాంకేతిక అవసరాలకు అనుగుణంగా కవచ్ వెర్షన్ 4.0ను అభివృద్ధి చేసి, విస్తృతంగా పరీక్షించిన అనంతరం ప్రస్తుతం అమల్లోకి తీసుకొస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇది ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) వ్యవస్థగా పనిచేస్తూ రైళ్ల రాకపోకల్లో భద్రతను మరింత పెంచనుంది.

కవచ్ 4.0లో అధునాతన భద్రతా ఫీచర్లు

కొత్త వెర్షన్‌లో రైలు ఉన్న ప్రదేశాన్ని మరింత ఖచ్చితంగా గుర్తించే సాంకేతికతను మెరుగుపరిచారు. పెద్ద రైల్వే యార్డుల్లో సిగ్నల్ సమాచారాన్ని స్పష్టంగా అందించే విధంగా వ్యవస్థను ఆధునీకరించారు. అలాగే స్టేషన్ నుంచి స్టేషన్‌కు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (OFC) ఇంటర్‌ఫేస్, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థతో నేరుగా అనుసంధానం వంటి కీలక సాంకేతిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ ఆధునిక ఫీచర్ల ద్వారా రైళ్ల కదలికలను మరింత సమర్థంగా పర్యవేక్షించడంతో పాటు సిగ్నల్ సంబంధిత సమాచారాన్ని వేగంగా, ఖచ్చితంగా అందించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా రైల్వే ప్రయాణ భద్రత, వ్యవస్థ విశ్వసనీయత మరింత మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

భారతీయ రైల్వేలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో కవచ్ 4.0 అమలు కీలక ముందడుగుగా నిలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మొరాయిస్తున్న మీ సేవ సర్వర్.. ఇబ్బందుల్లో విద్యార్థులు

మొరాయిస్తున్న మీ సేవ సర్వర్.. ఇబ్బందుల్లో విద్యార్థులు

మొరాయిస్తున్న మీ సేవ సర్వర్ హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 23: నగరం లోని మీ సేవ కేంద్రాల్లో సర్వర్‌ మొరాయిస్తోంది. ఉదయం నుంచి రాత్రివరకు ఇదే పరిస్థితి ఉంటుండడంతో వివిధ పనులపై వెళ్లిన పౌరులు, విద్యార్థులు తీవ్ర అస

మిగతా చదవండి →

హైదరాబాద్‌లో ఘనంగా గురజాడ అప్పారావు జయంతి వేడుకలు

హైదరాబాద్‌లో ఘనంగా గురజాడ అప్పారావు జయంతి వేడుకలు

గురజాడ అప్పారావు జయంతి వేడుకలు ఘనంగా త్యాగరాయ గానసభలో ‘ఎందరో మహానుభావులు – మధుర స్మృతులు’ కార్యక్రమం గురజాడ సాహిత్య సేవలను స్మరించిన ప్రముఖులు హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 23: తెలుగు సాహిత్యానికి, సామాజిక సంస్క

మిగతా చదవండి →

శ్రీకాంత్ అన్నకు జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ సభ్యుల ఘన జన్మదిన శుభాకాంక్షలు

శ్రీకాంత్ అన్నకు జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ సభ్యుల ఘన జన్మదిన శుభాకాంక్షలు

శ్రీకాంత్ అన్నకు జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ సభ్యుల ఘన జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన వెంకట్ రాపోలు హైదరాబాద్, సెప్టెంబర్ 21 (ట్రైనెట్ న్యూస్): శ్రీకాంత్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకుని జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ (

మిగతా చదవండి →

శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో సుందరకాండ పారాయణం

శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో సుందరకాండ పారాయణం

శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో సుందరకాండ పారాయణం నవరాత్రోత్సవాల్లో 9వ రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు హైదరాబాద్, సెప్టెంబర్ 22 (ట్రైనెట్ న్యూస్): ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థా

మిగతా చదవండి →