బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,716+2.05%
NIFTY25,768+2.14%
22K₹1,12,787/10g+1.24%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

జాతీయ వార్తలు

‘ఇంద్ర–2026’ విన్యాసాల కోసం రష్యాకు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి

nagendraసోమవారం, 12 అక్టోబర్ 2026 · 2:34 AM8 వీక్షణలుtrinetnews.com
‘ఇంద్ర–2026’ విన్యాసాల కోసం రష్యాకు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి
  • న్యూఢిల్లీ, అక్టోబర్‌ 11 (ట్రైనెట్‌ న్యూస్‌):

భారత నౌకాదళం, రష్యా నౌకాదళం సంయుక్తంగా నిర్వహించనున్న ‘ఇంద్ర–2026’ ద్వైపాక్షిక నౌకా విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి అక్టోబర్‌ 10న రష్యాలోని వ్లాదివోస్తోక్‌కు చేరుకుంది. అక్టోబర్‌ 13 నుంచి 18 వరకు జరగనున్న ఈ విన్యాసాలు ఇరు దేశాల నౌకాదళాల మధ్య వృత్తిపరమైన అనుభవాల మార్పిడి, సముద్ర కార్యకలాపాల్లో సమన్వయం, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి.

భారత ప్రభుత్వం ప్రతిపాదించిన ‘మహాసాగర్‌’ (ప్రాంతాల మధ్య భద్రత, అభివృద్ధి కోసం పరస్పర, సమగ్ర పురోగతి) దార్శనికతకు అనుగుణంగా ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి ఈ విన్యాసాల్లో పాల్గొంటోంది. భారత్‌–రష్యా మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న రక్షణ, సముద్ర భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత పటిష్ఠం చేయనుంది. 2025 డిసెంబర్‌ 4–5 తేదీల్లో జరిగిన 23వ భారత్‌–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు ద్వారా సాధించిన పురోగతిని ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ఇది అవకాశం కల్పిస్తుంది.

‘ఇంద్ర–2026’ విన్యాసాలు తొలుత నౌకాశ్రయ దశలో ప్రారంభమై, అనంతరం సముద్రంలో సమన్వయంతో నిర్వహించే కార్యకలాపాలతో కొనసాగనున్నాయి. ఇరు నౌకాదళాల మధ్య పరస్పర అవగాహన, కార్యాచరణ సమన్వయం, కలిసి పనిచేసే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు వృత్తిపరమైన సమావేశాలు, వివిధ నౌకా విన్యాసాలు నిర్వహించనున్నారు.

విన్యాసాలతోపాటు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. వీటి ద్వారా ఇరు దేశాల నౌకాదళ సిబ్బంది పరస్పరం కలుసుకుని స్నేహబంధాలను బలోపేతం చేసుకోవడంతోపాటు ప్రజల మధ్య సంబంధాలను మరింత పెంపొందించుకునే అవకాశం లభించనుంది.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :