శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,189/10g+1.56%
భాషలు

తాజా వార్తలు

అక్రమ నిర్మాణాలపై చర్యలు నిల్ ఫిర్యాదులు వెల్లువెత్తినా స్పందన కరువు

Illegal constructions within the GHMC limits have reached around 40,000, yet authorities remain inactive despite a flood of complaints.

nagendra24 September 2026, 7:10 PM2 చూసులుtrinetnews.com
అక్రమ నిర్మాణాలపై చర్యలు నిల్ ఫిర్యాదులు వెల్లువెత్తినా స్పందన కరువు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

40 వేలకు చేరిన అక్రమ నిర్మాణాలు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 24:

కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారుల వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. కొద్దిరోజుల క్రితం గచ్చిబౌలి అంజయ్యనగర్లో ఏడు అంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు మృతి చెందిన ఘటనతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపు తున్నారు. అనుమతులు ఉల్లంఘించిన భవనాలకు 24 గంటల నోటీసులు ఇచ్చి మరీ కూల్చివేతలు చేప డుతున్నారు. అయితే, అతిపెద్ద కార్పొరేషన్ అయిన జీహెచ్ఎంసీ మాత్రం తగినంత యంత్రాంగం, సిబ్బంది ఉన్నప్పటికీ ఎలాంటి ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టకపోవడంపై నగరవాసుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే 'ప్రజావాణి'కి వస్తున్న వినతుల్లో సగానికి పైగా అక్రమ నిర్మాణాలపైనే ఉంటున్నాయి. ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై అధికారులు స్పందిస్తూ 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (సర్) వంటి ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నామని సాకులు చెబు తున్నారు. అయితే, తక్కువ మంది సిబ్బంది ఉన్న సీఎంసీ, ఎంఎంసీ అధికారులు ఎన్ని కల విధులు నిర్వహిస్తూనే ప్రతి శనివారం ఫుట్పాత్ ఆక్రమణలు, రోడ్లు, నాలాల కబ్జా లను క్రమం తప్పకుండా తొలగిస్తుండటం గమనార్హం. గతంలో ప్రమాదాలు జరిగిన సందర్భంలో కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 30 వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తెలపగా, ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 40 వేలకు చేరినట్లు సమాచారం. ప్రతీ వారం ఫుట్పాత్ ఆక్ర మణల తొలగింపు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ, జీహెచ్ఎంసీలో కొద్ది నెలలుగా ఆ ప్రక్రియ పూర్తిగా నిలిచిపో యింది. తోటి కార్పొరేషన్లు కఠిన చర్యలతో ముందడుగు వేస్తుంటే, ఫిర్యాదులు కుప్పలు గా వస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.

ఇవి కూడా చదవండి

రైల్వే డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రైల్వే డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రైల్వే డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. హైద్రాబాద్, ట్రైనెట్, న్యూస్, అక్టోబర్,9.పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరితంగా నిర్వహించారు.తార్నాక లోని రైల్వే డిగ్రీ కళాశాలలో 1985 బ్యాచ్ తెలుగు మీడియం విద్యా

మిగతా చదవండి →

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు రవీంద్రభారతిలో ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం అక్టోబరు 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ హైదరాబాద్‌, అక్టోబరు 9 (ట్రైనెట్ న్యూస్): తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘

మిగతా చదవండి →

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 9, 2026: హైదరాబాద్‌లోని బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో 46వ స్నాతకోత్సవం ఘనంగా నిర్

మిగతా చదవండి →

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి: డాక్టర్ కేవీ రమణాచారి

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి: డాక్టర్ కేవీ రమణాచారి

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి డాక్టర్ కేవీ రమణాచారి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 9 : నేటి యువతలో మంచి చేయాలనే ఆలోచనలు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణ చారి అన్నారు. బ్రాహ్మణ

మిగతా చదవండి →