Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

Youth Must Cultivate Patriotism: MLC Madhusudhana Chari

MLC Madhusudhana Chari emphasized the importance of patriotism among youth during Independence Day celebrations at Thyagaraya Gana Sabha.

nagendra15 August 2026, 4:02 AM6 व्यूtrinetnews.com
Youth Must Cultivate Patriotism: MLC Madhusudhana Chari

Share this story

Share link keeps your language (?lang=)

చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 14 :

యువత దేశభక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనా చారి అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సత్య సంగీత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మధుసూదనా చారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్య సంగీత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. గాయకులతో పాటు సమాజంలో విశిష్ట సేవలు అందించిన వారిని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. అనంతరం వివిధ రంగాలలో సేవలందించిన వారికి పురస్కారాల ప్రధానం చేశారు. సభకు ముందు గాయని, గాయకులను అలపించిన సినీ గీతాలు అలరించాయి. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు బంపర్ రాజు పాల్గొన్నారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →