హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 27: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్‌షిప్లో భాగంగా సత్య సి.సి., తిరుమల సి.సి. జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సత్య క్రికెట్ క్లబ్ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సత్య సి.సి. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. యశ్ రాజ్ సింగ్ 147 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మెట్టు దక్ష్‌దీప్ 120 బంతుల్లో 14 ఫోర్లతో 111 పరుగులు చేశాడు.
అనంతరం 280 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన తిరుమల సి.సి. 45.2 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటైంది. దీంతో సత్య సి.సి. 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.





