కుంకుమార్చనకు పోటెత్తిన మహిళలునల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్
హాలియా: హాలియా పట్టణంలోని పేరూరు రోడ్డులో ఉన్న శ్రీ లక్ష్మీగణపతి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 30వ సంవత్సరం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. మహిళలతో కార్యక్రమ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో సందడిగా మారింది.
కుంకుమార్చనకు మహిళల నుంచి ఇంతటి విశేష స్పందన లభించడం ఎంతో ఆనందంగా ఉందని శ్రీ లక్ష్మీగణపతి యూత్ నిర్వాహకులు తెలిపారు. భక్తుల సహకారం, ఆదరణతో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.





