హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,సెప్టెంబర్,5. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీమంత్రి, అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. శనివారం పద్మారావు నగర్ లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఫీజు రీ యంబర్స్ మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని విద్యార్థులతో నిర్వహించిన భారీ ర్యాలీ లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. పద్మారావు నగర్ లోని SP కాలేజీ నుండి ఎన్ టి ఆర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీ లో వివిధ కాలేజీ లకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 12 వేల కోట్ల రూపాయల ఫీజు రీ యంబర్స్ మెంట్ బకాయిలను చెల్లించకుండా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యల వల్ల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా మానసిక వత్తిడులకు గురవుతున్నారని అన్నారు. చదువు పూర్తయిన ప్పటికీ ఫీజు రీ యంబర్స్ మెంట్ ను ప్రభుత్వం చెల్లించని కారణంగా విద్యా సంస్థల యాజమాన్యాలు సర్టిఫికెట్ లను ఇవ్వడం లేదని, దీంతో విద్యార్థులు పై చదువులకు వెళ్లలేకపోతున్నారని వివరించారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులకు ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశం తో స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీ యంబర్స్ మెంట్ ను తీసుకొచ్చారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం సకాలంలో ఫీజు రీ యంబర్స్ మెంట్ లను చెల్లించి విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూసిందని చెప్పారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యను చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఓవర్సీస్ కార్యక్రమం క్రింద ఒక్కో విద్యార్థికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. దీంతో అనేకమంది విద్యార్థులు చదువును మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వలనే లక్షలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చారని అన్నారు. ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అయినా అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం లో చేపట్టిన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రిబ్బన్ లు కట్ చేస్తూ తమ ప్రభుత్వం గొప్పలుగా చెప్పుకోవడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ తమ ప్రభుత్వ హయాంలో పనులు చేపట్టి 60 శాతం పనులు జరిగిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. ముసారాంబాగ్ బ్రిడ్జి, సైదాబాద్ బ్రిడ్జి కేసీఆర్ ప్రభుత్వం లో పనులు ప్రారంభించామని చెప్పారు. కానీ తమ ప్రభుత్వమే నిర్మించిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి పచ్చి అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ని పాలిటెక్నిక్ కాలేజీల ఆస్తులపై కన్నేసిన ముఖ్యమంత్రి వాటిని ప్రయివేట్ వ్యక్తులు, సంస్థలకు దారాదత్తం చేయాలని కుట్రలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ 97 తో పాలిటెక్నిక్ విద్య భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కాలేజీలను ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం తో నడిచే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కి అనుసంధానం చేయాలని చూస్తున్నారని అన్నారు. జిఓ97 ను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడమే కాకుండా వెయ్యి రోజుల పాలనలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేశామని సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. మీ దోపిడీ, అవినీతి పై మీ పార్టీ నాయకులు, మంత్రులు విమర్శిస్తున్నారని, ప్రజాపాలన అని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. పాలన చేతగాక మీ అంతర్గత కుమ్ములాటలతో ఢిల్లీలో రాష్ట్ర పరువును తీస్తున్నారని మండిపడ్డారు. విద్యార్ధినీలకు స్కూటీలు ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని, వికలాంగుల పెన్షన్ ను ఇస్తామని మేనిఫెస్టో లో ప్రకటించలేదా అని ప్రశ్నించారు. బూతు మాటలు మాని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వం పై బిఆర్ఎస్ ప్రజల పక్షాన అసెంబ్లీ లో, బయట పోరాడతామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విసిగిపోయారని, మీ ప్రభుత్వం దిగిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పద్మారావు నగర్ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, అంబులెన్స్ సురేష్, వెంకటరమణ, మహేందర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, కొత్తూరు వెంకట్, అశ్విన్, జగ్గయ్య, రవి, ముక్కా శ్రీనివాస్, శ్రీనివాస్, అనిత, నాగలక్ష్మి,
తాజా వార్తలు
Will not let government rest until poll promises are fulfilled: Talasani
BRS MLA Talasani Srinivas Yadav warned that the party will not spare the Congress government until it fulfills all guarantees given to the people.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్లో మీ భాష (?lang=) జత అవుతుంది



ఇవి కూడా చదవండి
ఎల్ నినో ప్రభావానికి తోడుగా విద్యుత్ కోతలతో వరిపంటకు నీటి పారుదలలో సమస్యలు చేతికి అందివచ్చే సమయంలో నీటిలభ్యతలో అసౌకర్యాలు

Paddy farmers in Yadadri Bhuvanagiri district are struggling to save their crops as El Nino and severe power cuts disrupt irrigation just before harvest.
మిగతా చదవండి →కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనపై బీఆర్ఎస్ సమరభేరి పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి – జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి – యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి

BRS staged a massive protest in Alair demanding the Congress government clear pending fee reimbursements and fulfill youth declaration promises.
మిగతా చదవండి →మెట్టుగూడ డివిజన్ లో కాంగ్రెస్ 1000 రోజుల పాలన సంబరాలు.ర్యాల రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుక కార్యక్రమం జరగబడింది

Under the leadership of Ryala Rajender Yadav, Congress leaders and workers celebrated 1000 days of people-centric governance in Mettuguda.
మిగతా చదవండి →సికింద్రాబాద్ జిల్లా సెక్రెటరీ రాజేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో.రెండో ఫేస్ సార్ న్యూ ఓటర్లు ఫామ్ 6 డిస్ట్రిబ్యూషన్

Secunderabad District Congress General Secretary Ralla Rajender Yadav spearheaded the Phase-2 Form 6 distribution at Mettuguda.
మిగతా చదవండి →