Friday9 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,073/10g+1.43%
भाषाएँ

Latest News

Visakhapatnam Steel Plant to Be Strengthened Under NDA Government: TDP Chief Palla Srinivasa Rao

AP TDP Chief Palla Srinivasa Rao assured that the Visakhapatnam Steel Plant will be further strengthened under the coalition government, ensuring livelihoods for thousands.

nagendra5 September 2026, 9:10 AM4 व्यूtrinetnews.com
Visakhapatnam Steel Plant to Be Strengthened Under NDA Government: TDP Chief Palla Srinivasa Rao

Share this story

Share link keeps your language (?lang=)

అమరావతి సెప్టెంబర్ 5 ట్రైనెట్

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధి, వేలాది కుటుంబాల జీవనోపాధితో ముడిపడి ఉన్న కీలక సంస్థ అని  ఏపీ టీడీపీ చీఫ్ , గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.

ఈరోజు ఉదయం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ భవనంలో  ఎంపీ  శ్రీభరత్‌, ప్లాంట్‌ సీఎండీ ఎం.ఎన్‌.వి.ఎస్‌. ప్రభాకర్‌లతో కలిసి పల్లా శ్రీనివాసరావు కీలక సమీక్షా సమావేశంలో స్టీల్ ప్లాంట్ అభివ్రుది పై జరిగిన చర్చలో పాల్గొన్నారు.

ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను మరింత బలోపేతం చేసి, పూర్తి సామర్థ్యంతో అభివృద్ధి పథంలో నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని

ముఖ్యమంత్రి  చంద్రబాబు స్టీల్ ప్లాంట్ అభివ్రుది కి అంకితభావంతో  కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ  స్టీల్‌ప్లాంట్‌ మరింత బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందననీ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాంట్‌ పునరుద్ధరణకు రూ.14 వేల కోట్లు కేటాయించడం, ప్లాంట్‌ కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం శుభపరిణామమని పేర్కొన్నారు.

ప్లాంట్‌ భవిష్యత్తుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,  స్పష్టం చేశారు. ఉత్పత్తి, ఆర్థిక పరిస్థితులు, కార్మికుల సమస్యలు, నిర్వాసితుల అంశాలపై సీఎండీతో సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు.  యాజమాన్యం చేపడుతున్న చర్యలకు అధికారులు, కార్మికులు సమష్టిగా సహకరించాలని పిలుపునిచ్చారు.

ప్లాంట్‌ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన దాదాపు 8 వేల మంది ఆర్‌-కార్డు నిర్వాసితులకు రిక్రూట్‌మెంట్‌లో తొలి ప్రాధాన్యత కల్పించి న్యాయం చేయాలని సమావేశంలో ప్రతిపాదించినట్లు పల్లా తెలిపారు.

గతంలో సమ్మె సమయంలో కొన్ని కారణాలతో కార్మికుల ఆధార్‌ కార్డులు బ్లాక్‌ అయిన అంశాన్ని సీఎండీ దృష్టికి తీసుకెళ్లగా, వాటిని తక్షణమే అన్‌బ్లాక్‌ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు.

ఆర్‌ అండ్‌ బీ రోడ్డు పరిధిలోని భూ వివాదాలు, కోర్టు ఉత్తర్వుల మేరకు రైతులకు ప్రత్యామ్నాయ భూముల కేటాయింపు అంశాలపై సమావేశంలో  చర్చించినట్లు పల్లా వెల్లడించారు.

ప్లాంట్‌పై ఉన్న ఆర్థిక భారాన్ని అధిగమిస్తూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, భవిష్యత్తులో మరింత పటిష్టమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, యాజమాన్యం కలిసి పనిచేస్తున్నాయని పల్లా శ్రీనివాస్ రావు తెలిపారు.

     ట్రై నెట్  రాజా పెంట పాటి అమరావతి ఏ పి

यह भी पढ़ें

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के छात्रों का स्नेह मिलन समारोह। हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर। पूर्व छात्रों का स्नेह मिलन समारोह उत्साहपूर्वक आयोजित किया गया।

और पढ़ें →

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से रविन्द्र भारती में एंगिलीपूला बతుకమ్మ के साथ ‘प्रजाला బతుకమ్మ–2026’ उत्सव शुरू होगा। 18 अक्टूबर को टैंक बंड पर सद्दूला बతుకమ్మ। हैदराबाद, 9 अक्टूबर (ट्रैनेट न्यूज):

और पढ़ें →

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

तत्काल प्रकाशन के लिए महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह हैदराबाद, ट्राइनेट न्यूज़, 9 अक्टूबर 2026: हैदराबाद के बेगमपेट स्थित सेंट फ्रांसिस महिला कॉलेज में 46वां दीक्षांत समारोह भव्य रूप से आयोजित किया गया।

और पढ़ें →

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर: तेलंगाना राज्य सरकार के पूर्व सलाहकार डॉ. के.वी. रमणाचारी ने कहा कि आज के युवाओं में दूसरों का भला करने की सोच होनी चाहिए।

और पढ़ें →