హైదరాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ట్రైనేట్ న్యూస్ సెప్టెంబరు 7 :
దిల్‌సుఖ్‌నగర్‌లో ఈరోజు జరిగిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా (IHRCI) కార్యక్రమంలో యూత్ వింగ్‌కు చెందిన సుమారు 35 మంది సభ్యులకు ఐడీ కార్డులు, సర్టిఫికెట్లను నేషనల్ ప్రెసిడెంట్ కటకం శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ ట్రెజరర్ రజినీష్, నేషనల్ అడ్వైజర్ లక్ష్మీ సౌజన్య, లీగల్ అడ్వైజర్ భానుమూర్తి, నేషనల్ సేవాదళ్ వైస్ చైర్మన్ దివ్య గౌడ్, తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఉత్తమ్ కుమార్తో పాటు యూత్ టీం సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా యూత్ EC సభ్యుడిగా గాలం వీరేంద్ర బాబుకు సర్టిఫికెట్, ఐడీ కార్డు అందజేశారు. మానవ హక్కుల పరిరక్షణ, ప్రజా సేవలో నిబద్ధతతో పనిచేస్తానని వీరేంద్ర తెలిపారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ IHRCI తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.





