ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

శుక్రవారం4 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:27 pm

శుక్రవారం

4 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:27 pm

SENSEX76,153-1.44%
NIFTY23,873-1.25%
హైదరాబాద్ 22K₹1,46,636/10g+2.02%
హైదరాబాద్ 24K₹1,59,967/10g+2.02%
వెండి₹2,21,741/kg+2.07%

తాజా వార్తలు

వి"లక్షణ"-లక్ష్య కళాకారులు బత్తిన విక్రమ్ కుమార్ తన నటనతో నవరసాలు పలికించారు

Bathina Vikram Kumar has made a significant mark as a Kuchipudi dancer, theater director, and cultural promoter, earning numerous awards for his multifaceted contributions to the arts.

nagendra3 September 2026, 8:37 PM0 చూసులుtrinetnews.com
వి"లక్షణ"-లక్ష్య  కళాకారులు బత్తిన విక్రమ్ కుమార్  తన నటనతో నవరసాలు పలికించారు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

దర్శకత్వం వహించిన నాటకాలకు పురస్కారాలు

సాంస్కృతిక ప్రయాణం బహుముఖ విశేషం

కళా రూపకాలకు ప్రముఖుల నుండి ప్రశంసలు

రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 3, :

సంస్కృతి-సంప్రదాయ మూలాలను, పరంపరా గత శాస్త్రీయ కళల్ని భద్రంగా కాపాడుకోవడం అనేది యజ్ఞ సమానం. నేటి ఆధునికత పోకడల ప్రపంచానికి అత్యంత ప్రాధాన్యమైనదికూడా. అటువంటి పవిత్రమైన సాంస్కృతిక రక్షణ యజ్ఞానికి ఎవరో ఒకరు కర్తృత్వం వహిస్తే తప్ప ఆ యజ్ఞ ఫలం పది మందికీ పంచలేం. అది ఒక్క సాధన-శోధన- పరశోధన-పరివ్వాప్తి ప్రాతిపదికన సంకల్పంగా ఆచమనీయం చేస్తేనే సాధ్యమవుతుంది. అలా సత్సంకల్పం చేసి సంప్రదాయ శాస్త్రీయ నృత్యాల పోషణ యజ్ఞానికి ఎవరో ఒకరు కంకణం కట్టుకోవాలి. అది నేనేయెందుకు కాకూడదు అనుకున్నారు. కాదు! సంసిద్ధులయ్యారు. ఆయనే వి"లక్షణ"-లక్ష్య కళాకారులు బత్తిన విక్రమ్ కుమార్ (విక్రమ్ గౌడ్).

కూచిపూడి నర్తకుడు, నాటక దర్శకుడు, అంతర్జాతీయ స్థాయిలో నృత్యోత్సవాల నిర్వాహకుడు, పత్రికా సంపాదకుడు..‌.ఇలా చతుర్విదాభినయంగా సాగిస్తూనే క్రమం తప్పని విక్రమ్ కుమార్ సాంస్కృతిక ప్రయాణం బహుముఖ విశేషమైనది. గజ్జెకట్టి కూచిపూడి పీఠం వరకు విక్రమ్ కుమార్ నాట్య ప్రయాణం బాల్యంలోనే తండ్రి ప్రోత్సా హంతోనే ప్రారంభమైంది. పాఠశాల స్థాయి నుంచే నాట్యంపై అమితమైన ఆసక్తిచూపి ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి కూచిపూడి విభాగంలో అత్యుత్తమ ప్రతిభతో ప్రథమోన్నత(డిస్టింక్షన్) శ్రేణితో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎం.ఏ.) పూర్తి చేశారు. ఆంధ్రా విశ్వ విద్యాలయంలో స్నాతకోత్తర విద్యను అభ్య సిస్తున్న సమయంలోనే, అక్కడ ప్రత్యేకంగా 'నృత్య విభాగం' ఏర్పాటు చేయడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. అంతే కాకుండా, కూచిపూడి నృత్య రూపకాలలో ప్రధాన పాత్రలు పోషిస్తూ, విశ్వవిద్యాలయం తరఫున జాతీయ స్థాయి నాటక, నృత్య ఉత్సవాల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్నారు. పరిశోధనా రంగంలో విశేష కృషిశాస్త్రీయ నాట్య అభ్యాసంతో పాటు, నాట్య శాస్త్ర పరిశోధనలో ఆయన సృష్టించిన మార్కు-మార్పు అపారమైనది. ఎం.ఏ. కూచిపూడి చదువుతున్న రోజుల్లోనే "కూచిపూడిలో శివ తాండవం-సప్త తాండవాలు"పై లోతైన పరిశోధనచేశారు. ప్రసిద్ధ కవి పుట్టపర్తి నారాయణాచార్యుల రచనలతో పోల్చుతూ ఆయన సమర్పించిన పరిశోధనా గ్రంథానికి ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి శత శాతం ఆమోదం లభించడం ఆయన పాండిత్యానికి నిదర్శనం. ప్రయోగశీల కొరియోగ్రఫీ, నాటక రంగం సాంప్రదాయ కూచిపూడి సరిహద్దుల్ని దాటకుండానే, ఆధునిక శైలికి అద్దం పడుతూ విక్రమ్ కుమార్ రూపొందించిన కొరియోగ్రఫీ ప్రయోగాలు కళాభిమానుల్న విశేషంగా ఆకట్టుకున్నాయి. సింహాచల వరాహ లక్ష్మీనరసింహ స్వామి చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న ప్రయోగాత్మక కూచిపూడి నృత్య రూపకం "చెంచు లక్ష్మీ నరసింహ కల్యాణం" నిజంగా వీక్షణ యోగమే. కూచిపూడి శాస్త్రీయతతో ప్రారంభమై జానపద రూపంతో ముగిసే ఈ అద్భుత ప్రదర్శన దేశవ్యాప్తంగా శతాధిక ప్రదర్శనల భాగ్యంగా భాసిల్లి చరిత్ర సృష్టించింది. స్వచ్ఛగంగా - స్వచ్ఛ భారత్: 'భగీరథ విలాసం' ఇతి వృత్తంగా చేసుకుని, పరిశుద్ధమైన తాగునీటి ప్రాముఖ్యతను

పర్యావరణ పరి రక్షణను చాటిచెప్పేలా ఈ నృత్య రూపకాన్ని మలిచారు. మహా విశాఖ వైభవం, శ్రీకృష్ణ లీలలు, సొసైటీ ఫర్ ఫ్యూచర్, యూత్ నెవర్ స్లీప్స్ వంటి నృత్య రూపకాలు ఆయన సృజ నాత్మకతకు అద్దం పడతాయి.

ప్రత్యేకంగా చెప్పాల్సింది

"వందేమాతరం" రంగస్థల నాటకం.. రాష్ట్ర ప్రభుత్వం 2000 వ ఏడాది లో నిర్వహించిన నంది నాటకోత్సవాల్లో ప్రయోగాత్మక నాటకంగా విమర్శకుల విశేష ప్రశంసలు పొందింది.

నాటక రంగంలో శతాబ్ది ప్రతిభ నటన, దర్శకత్వ రంగాల్లోనూ విక్రమ్ కుమార్ తన మార్కును స్పష్టంగా చూపించారు. కన్యాశుల్కం, సత్య హరిశ్చంద్ర, బొబ్బిలి యుద్ధం వంటి చారిత్రక, పౌరాణిక, సామాజిక నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. ఆయన దర్శకత్వం వహించిన నాటకాలు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం, యూజీసీని న్యాక్ కమిటీ సభ్యులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక రంగానికి ఆయన చేసిన నిరంతర సేవలకుగాను అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి: ఏపీ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ ఉత్తమ పురస్కారం, బెస్ట్ ప్రమోటర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అవార్డు పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ ఎక్సలెన్సీ అవార్డు (ఒడిస్సా గవర్నర్ చేతుల మీదుగా). రాష్ట్రీయ కళాపోషక్ సమ్మాన్ (కేంద్ర న్యాయ శాఖ మంత్రి చేతుల మీదుగా) జగదేవ్ ఎక్సలెన్సీ అవార్డు నాట్య కళాపోషక అవార్డు. 39వ

పీఆర్ఎస్ఐ జాతీయ సదస్సులో ‘బెస్ట్ ఎన్జీవో ఫర్ సీఎస్ఆర్’ పురస్కారం అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్ డే లీగ్ ఛాంపియన్ మ్యాచ్‌లో ధ్రువ్ XI సి.సి. జట్టు అద్నాన్ సి.సి.తో తలపడింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్ డే లీగ్ ఛాంపియన్ మ్యాచ్‌లో ధ్రువ్ XI సి.సి. జట్టు అద్నాన్ సి.సి.తో తలపడింది.

Driven by Viyan Agarwal's impressive knock and Deepak Kumar's 4-wicket haul, Dhruv XI CC clinched a thrilling 3-run victory in the HCA C Division One-Day League.

మిగతా చదవండి →