హైదరాబాద్, చిలకలగూడ, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 31:
చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆచూకీ తెలియకుండా తిరుగుతున్న ఇద్దరు మహిళలను పోలీసులు రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వీరిలో సుమారు 70 ఏళ్ల వయస్సున్న వృద్ధురాలు తన పేరు బాలమణి అని మాత్రమే చెబుతూ, ఇతర వివరాలేవీ వెల్లడించలేకపోతోంది. మరొక మహిళ తన పేరు వడ్డే గోవిందమ్మ (55), భర్త పేరు వెంకటప్ప అని, స్వస్థలం కేవీ రంగారెడ్డి జిల్లా జింగుర్తి మండలం అని పేర్కొంటోంది తప్ప కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు చెప్పలేకపోతోంది.
దీంతో చిలకలగూడ సీఐ వలిశెట్టి రామకృష్ణ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ పూస శ్రీనివాస్ ఆ ఇద్దరినీ సికింద్రాబాద్‌లోని డ్రీమ్ ఇండియా హోమ్ ఆశ్రమానికి తరలించి ఆశ్రయం కల్పించారు. వీరి ఆచూకీ తెలిసిన బంధువులు లేదా స్థానికులు ఎవరైనా ఉంటే వెంటనే చిలకలగూడ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
---
___





