ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

ఆదివారం13 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:20 pm

ఆదివారం

13 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:20 pm

SENSEX74,782-1.77%
NIFTY23,398-1.60%
హైదరాబాద్ 22K₹1,44,640/10g+0.34%
హైదరాబాద్ 24K₹1,57,789/10g+0.34%
వెండి₹2,16,278/kg-1.67%

తాజా వార్తలు

“విద్య పుస్తకాలకే పరిమితం కాదు; అనుభవాల ద్వారా సంప్రదాయాలను, విలువలను, సంస్కృతిని పిల్లలకు చేరువ చేయడమే నిజమైన విద్య.”

Siddhartha Public School hosted a grand Grandparents' Day event, bringing generations together to craft clay Ganesha idols and celebrate traditions.

nagendra13 September 2026, 2:40 AM0 చూసులుtrinetnews.com
“విద్య పుస్తకాలకే పరిమితం కాదు; అనుభవాల ద్వారా సంప్రదాయాలను, విలువలను, సంస్కృతిని పిల్లలకు చేరువ చేయడమే నిజమైన విద్య.”

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్ , ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ ,12.

ఈ ఆలోచనకు అనుగుణంగా సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ చైర్మన్ జగదీశ్వర్ , డైరెక్టర్ డా. సుమన్ కుమార్ , ప్రిన్సిపల్ డా. వినయశ్రీ , వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి ప్రియాంకా ధూబే మార్గదర్శకత్వంలో గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా మట్టి వినాయక ప్రతిమల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు. కొందరు దూర గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వచ్చి తమ మనవళ్లు, మనవరాళ్లతో కలిసి మట్టితో అందమైన వినాయక ప్రతిమలను ఎంతో ఆనందంగా తయారు చేశారు.

పిల్లల ఉత్సాహాన్ని మించి పెద్దలు చూపిన ఆనందం, ఆసక్తి అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు సంప్రదాయం, సృజనాత్మకతను అనుభవిస్తూ నేర్చుకోవడంతో పాటు, తమ తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలతో ప్రేమ, ఆప్యాయతలతో కూడిన మధురమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమం అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అనుభూతిగా నిలిచింది.

ఇవి కూడా చదవండి