Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,235/10g+1.53%
भाषाएँ

Latest News

Tribute to Nitya Annadata Dokka Seetamma in Hyderabad

A commemorative event honoring Dokka Seetamma was jointly organized by Sri Thyagaraya Ganasabha and the Department of Language and Culture.

nagendra20 August 2026, 12:22 PM8 व्यूtrinetnews.com
Tribute to Nitya Annadata Dokka Seetamma in Hyderabad

Share this story

Share link keeps your language (?lang=)

​హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 20 :

శ్రీ త్యాగరాయ గానసభ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో "ఎందరో మహానుభావులు మధుర స్మృతులలో" భాగంగా నిత్యఅన్నదాత, అన్నపూర్ణ డోక్కా సీతమ్మ యాదిలో సభ శ్రీ

త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్, శాసనమండలి ప్రతిపక్షనేత

సిరికొండ మధుసూదనాచారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ, అన్నపూర్ణ గానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ అని కొనియాడారు.

భారతీయ సాంప్రదాయంలో అన్నదానానికి మించిన దానంలేదని విశ్వసించి, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమే ధ్యేయంగా ‘అతిథి దేవోభవ‘ అన్నపదానికి ఉదాహరణగా నిలిచినవ్యక్తి డొక్కా సీతమ్మ అని పేర్కొన్నారు. శ్రీత్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా వి.ఎస్. జనార్దన్ మూర్తి అధ్యక్షత వహించి మాట్లాడుతూ.. మహనీయులను చరితను భావితరాలకు అందించడానికి గానసభ ఆధ్వర్యంలో వారి జయంతి వర్ధంతి వేడుకలను ఎందరో మహానుభావుల పేరిట నిర్వహిస్తున్నట్లు తెలిపారు

కార్యక్రమంలో

సీనియర్ పత్రికేయులు

జయసూర్య, సంఘసేవకులు ​లయన్ డాక్టర్ జి.కె. రమణ, గానసభ సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి చక్రపాణి,

​ కళా శారదాదీక్షితులు, శ్రీత్యాగరాయ గానసభ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

హైదరాబాద్‌లో నవంబర్ 19 నుంచి 22 వరకు 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ )

హైదరాబాద్‌లో నవంబర్ 19 నుంచి 22 వరకు 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ )

సెక్రటేరియట్ లో IRC ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష • కనీవినీ ఎరగని రీతిలో, తెలంగాణ ఖ్యాతి చాటేలా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు ఆదేశం • 3,000 మంది డెలిగేట్స్, 400 ఎగ్జిబిషన్ స్టాళ్లతో, హైటెక్స్‌లో నాలుగు రోజుల పాటు జాతీయ స్థాయి సదస్సు • ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఇతర రాష్ట్రాల మంత్రులు • అతిథుల వసతి, రవాణా, ఆతిథ్యం, రాష్ట్ర పర్యాటక ప్రాంతాల సందర్శనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో 25వేల కోట్లతో రాష్ట్రంలో నాణ్యమైన నూతన రోడ్ల నిర్మాణం • రిజనల్ రింగ్ రోడ్డుతో ప్రపంచంలోనే విశ్వనగరంగా హైదరాబాద్.. పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా తెలంగాణ • రూ.12,073 కోట్లతో హైదరాబాద్–విజయవాడ 6+2 లేన్ల జాతీయ రహదారి పనులకు త్వరలో ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు - ఐఆర్సీ పై ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

और पढ़ें →