ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

శనివారం19 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:15 pm

శనివారం

19 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:15 pm

SENSEX74,295+0.39%
NIFTY23,346+0.99%
హైదరాబాద్ 22K₹1,45,371/10g+1.47%
హైదరాబాద్ 24K₹1,58,586/10g+1.47%
వెండి₹2,22,342/kg+5.15%

తాజా వార్తలు

Title and Logo Launched for Magallu Zindabad Starring Hero Sri Nandu

The title launch event of 'Magallu Zindabad', starring young hero Sri Nandu, Vennela Kishore, and Viva Harsha under the direction of Nara Praveen, was held grandly.

nagendra19 September 2026, 2:30 AM0 చూసులుtrinetnews.com
Title and Logo Launched for Magallu Zindabad Starring Hero Sri Nandu

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హీరో శ్రీ నందు నటించిన మగాళ్లు జిందాబాద్ టైటిల్ లాంచ్

గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రసాద్ భాస్కర్ల, చైతన్య వంగవరపు నిర్మాతలుగా యంగ్ హీరో శ్రీ నందు, స్టార్ కమెడియన్స్ వెన్నెల కిషోర్, వైవాహర్ష నటిస్తున్న తాజా చిత్రం మగాళ్లు జిందాబాద్. నార ప్రవీణ్ రచన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ ఘనంగా జరిగింది. తెలుగు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి శిష్యుడిగా నారా ప్రవీణ్ సినిమా టైటిల్ తోనే తన ప్రత్యేకతను చాటుకున్నారు. కామెడీ కంటెంట్ లకు మంచి ఆదరణ దక్కుతున్న ఈ సమయంలో అద్భుతమైన టైటిల్, అంతే వినోదపరితమైన కంటెంట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు త్వరలో వస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.

డైరెక్టర్ నార ప్రవీణ్ మాట్లాడుతూ.. ఇదొక సెటైరికల్ కామెడీ ఫిలిం అని అందుకోసమే మగాళ్లు జిందాబాద్ అనే టైటిల్ పెట్టామని పేర్కొన్నారు. సొసైటీలో ఆడవారికి దక్కే కంఫర్ట్ గాని, న్యాయం కానీ, సింపతీ కానీ మగాడికి దక్కట్లేదు అనే టాపిక్ ను సెటైరికల్ టోన్ లో డీల్ చేస్తూ ఔట్ అండ్ ఔట్ కామెడీ జెనరేట్ చేశాం అని ,ఇది ఒక సోషల్ సెటైరికల్ మూవీ అని చెప్పారు. దీని మీదే ఈ సినిమా చాలా ఆహ్లాదకరమైన కామెడీతో సాగుతుందని వెల్లడించారు.

హీరోయిన్ లక్ష్మీ దుర్గ మాట్లాడుతూ.. మగాళ్లు జిందాబాద్ సినిమా అందరికీ నచ్చుతుందని, తనను నమ్మి మొదటి సినిమాగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్ చెప్పారు. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని అందుకే సినిమా జిందాబాద్ అని వెల్లడించారు. మగాళ్లు జిందాబాద్ సినిమాను తప్పకుండా ఆదరించాలని కోరారు.

హీరో శ్రీ నందు మాట్లాడుతూ మగాళ్లు జిందాబాద్ ఈ టైటిల్ చాలామందిలో ఆలోచనలను రేకెత్తిస్తుంది. మరికొందరికి నవ్వు తెప్పిస్తుంది. ఆడవాళ్లను డామినేట్ చేయడానికి ఈ టైటిల్ పెట్టలేదు. మగవాళ్ళ భావాలు, బాధలు, కష్టాలు చెప్పుకోవడానికి చాలామంది ఆలోచిస్తారు. అలాంటి వారి కోసమే ఈ టైటిల్ అనే హీరో శ్రీ నందు తెలిపారు. మరీ ముఖ్యంగా సమాజంలో ఎదురవుతున్న అనేక సవాలను ఎదుర్కొనే నిలబడుతున్నందుకు మగాళ్లు జిందాబాద్ అంతేకానీ ఆడవాళ్లను తక్కువ చేయడం కాదు, ఆడవాళ్లు ఎప్పుడూ గ్రేట్ అందుకే ఆడవాళ్లు జోహార్ అని అన్నారు. నిజ జీవితంలో మగవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను సినిమాలో వినోదపరితంగా చూపించడం కోసమే ఈ సినిమా అని ఆరేళ్ల నుంచి 60 ఏళ్ల వరకు కుటుంబ సమేతంగా హాయిగా నవ్వుకునే సినిమాని తెలిపారు. మగవాళ్లు చాలామంది ఈ సినిమాతో కనెక్ట్ అవుతారని, అప్పుల బాధలు, ఈఎంఐ బాధలు ఇవి మగవాళ్ళకే తెలుసని అన్నారు. సైక్ సిద్ధార్థ్, అగ్లీ స్టోరీ ఈ రెండు సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లో ఎక్కువమంది చూడలేదు కానీ మగాళ్లు జిందాబాద్ అందరినీ కడుపుబ్బ నవ్విస్తుందని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఆడియన్స్ తో మీడియా సమక్షంలో పంచుకుంటానని ఇది కేవలం టైటిల్ లాంచ్ మాత్రమే అని హీరో శ్రీ నందు తెలిపారు.

నిర్మాత ప్రసాద్ భాస్కర్ల మాట్లాడుతూ.. హీరో శ్రీ నందుకు ఇప్పటివరకు సరైన కంటెంట్ పడలేదని, మగాళ్లు జిందాబాద్ చిత్రం ఆయనకు కమర్షియల్ గా మంచి మైలేజ్ తీసుకొస్తుందని. ఈ సినిమాలో శ్రీ నందు నటన, డాన్స్, కామెడీ టైమింగ్ అంతా అద్భుతంగా ఉందని తెలిపారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష, శ్రీ నందు పోటాపోటీగా నటించి సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని, త్వరలోనే ఆడియన్స్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తారని వెల్లడించారు.

చిత్రం : మగాళ్లు జిందాబాద్

నటీనటులు : శ్రీ నందు, వెన్నెల కిషోర్, వైవా హర్ష, లక్ష్మి దుర్గ, అక్షర గౌడ తదితరులు

రచన-దర్శకత్వం : నార ప్రవీణ్

నిర్మాతలు : ప్రసాద్ భాస్కర్ల, చైతన్య వంగవరపు

సహ నిర్మాత : రాధిక కర్ల, భాస్కర్ల చంద్రశేఖర్, లక్ష్మీ భవాని

సంగీతం : శ్రీ చరణ్ పాకాల, మదిన్ ఎస్.కె

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : మున్నా కాసి

డిఓపి : సమీర్ కళ్యాణి

ఎడిటింగ్ : శ్రీధర్ సోంపల్లి

ఆర్ట్ : అమ్ము కార్తీక్

పబ్లిసిటీ : ధని ఆలే

పి ఆర్ ఓ : హరీష్ అప్పరాల

ఇవి కూడా చదవండి