శనివారం24 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX73,124-2.15%
NIFTY22,600-2.36%
22K₹1,30,645/10g-3.66%
భాషలు

తాజా వార్తలు

ఒకే కుటుంబంలో ముగ్గురికి ఉస్మానియా నుంచి పీహెచ్‌డీలు

Three members of the same family from Nalgonda district achieved a rare feat by receiving PhD degrees at Osmania University's 85th convocation.

nagendra9 September 2026, 1:57 AM6 చూసులుtrinetnews.com
ఒకే కుటుంబంలో ముగ్గురికి ఉస్మానియా నుంచి పీహెచ్‌డీలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

  1. హైద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్08

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ డాక్టరేట్‌ పట్టాలు అందుకుని అరుదైన ఘనత సాధించారు. నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధికి చెందిన కుకుడాల ఆంజనేయులు, కుకుడాల హైమావతి, కుకుడాల బాలకృష్ణలు మంగళవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్‌ ఆడిటోరియంలో జరిగిన 85వ స్నాతకోత్సవంలో డాక్టరేట్‌ పట్టాలు అందుకున్నారు.

భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ కుమార్‌ మొలుగారం చేతుల మీదుగా వారికి పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేశారు. కుకుడాల ఆంజనేయులు కామర్స్‌ విభాగంలో, కుకుడాల హైమావతి వృక్షశాస్త్రంలో, కుకుడాల బాలకృష్ణ సామాజిక శాస్త్రం (సోషియాలజీ)లో పరిశోధనలు పూర్తి చేసి డాక్టరేట్‌ పొందారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ మొక్కవోని దీక్షతో ఉన్నత విద్యను అభ్యసించామని వారు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి అత్యున్నత విద్యా పట్టా అందుకోవడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు ప్రస్తుతం ఆంజనేయులు హాలియా పట్టణంలోని శ్రీశ్లోక పాఠశాల ఛైర్మన్‌గా, హైమావతి అనుముల కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌గా, బాలకృష్ణ నల్గొండ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

తమ పరిశోధనలకు నిరంతరం ప్రోత్సాహం అందించిన ప్రొఫెసర్లు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఒకేసారి పీహెచ్‌డీలు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

బ్యాంకింగ్‌లో స్వదేశీ క్వాంటం సాంకేతికతలకు ఊతం: సీ–డాక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పందం

బ్యాంకింగ్‌లో స్వదేశీ క్వాంటం సాంకేతికతలకు ఊతం: సీ–డాక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పందం

బ్యాంకింగ్‌లో స్వదేశీ క్వాంటం సాంకేతికతలకు ఊతం సీ–డాక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందం భద్రత, ఆర్థిక విశ్లేషణ, సిబ్బంది నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ట్రైనెట్ న్యూస్, న్యూఢిల్లీ, అక్టోబర్ 23: బ్యాంకింగ్ రంగం

మిగతా చదవండి →

కేటీఆర్‌ను కలిసిన పసరకొండ కిశోర్.. ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశం

కేటీఆర్‌ను కలిసిన పసరకొండ కిశోర్.. ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశం

కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన పసరకొండ కిశోర్... - పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తా : కిశోర్ ట్రైనెట్ న్యూస్, అంబర్ పేట అక్టోబర్ 23 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును అంబర్ పేట ఎ

మిగతా చదవండి →

మల్లికార్జున నగర్ ట్రెజరర్‌గా ఉడుత శ్రీకాంత్ నామినేషన్

మల్లికార్జున నగర్ ట్రెజరర్‌గా ఉడుత శ్రీకాంత్ నామినేషన్

మల్లికార్జున నగర్ ట్రెజరర్‌గా ఉడుత శ్రీకాంత్ నామినేషన్ - ఆశీర్వదించండి కాలనీ అభివృద్ధి చేసి చూపిస్తా : ఉడుత శ్రీకాంత్ ట్రైనెట్ న్యూస్, అంబర్ పేట అక్టోబర్ 22 : బాగ్ అంబర్ పేట మల్లికార్జుననగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్ని

మిగతా చదవండి →

జేపల్లి క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రదానం

జేపల్లి క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రదానం

జేపల్లి క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రదానం... - వెల్జాల వెంకటేష్, గొడ్డేటి శేఖర్, కొర్రావత్ కవిత పవన్ నాయక్ ఆధ్వర్యంలో టోర్నమెంట్.. ట్రైనెట్ న్యూస్, నాగర్ కర్నూలు అక్టోబర్ 22 : దసరా పండుగను పురస్కరించుకుని చార

మిగతా చదవండి →