హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ సెప్టెంబర్ 1:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, కల్పన కళా నికేతన్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డి జ్ఞాపకార్థం 'తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి ' శ్రీ త్యాగరాయగానసభ కళా మారుతి కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ న్యాయవాది, కళాబంధు, కళాపోషకులు నాగేందర్, వంశీకృష్ణ ప్రతాప్ తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త,అయోధ్య రామయ్య
లోకం కృష్ణయ్య కర్నాటి నాగభూషణం , రమేష్‌గౌడ్ పాల్గొన్నారు. సభకు ముందు దొంతి జంగయ్య గౌడ్ నిర్వహణలో
గాయనీ గాయకులు ఆలపించిన
డా. మురళీమోహన్, ప్రదీప్ చంద్ర,
కె. సుధారెడ్డి, సి.హెచ్. జంగయ్య, ఎన్. రామ్మూర్తి, సి. కామేశ్వరి, ముల్లాడి ఉష , జ్యోత్స్న, రజని,
తదితరులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.






