హైదారాబాద్,రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 29 : విశ్వవిద్యాలయాలలో నిష్ర్కియాత్మకమైన కోర్సులకు విద్యార్ధి అభిరుచి కలిగిన మరేతర కళను జోడించి కోర్సులను రూపొందించాలని వాటికి అధునాతన, సాంకేతిక పద్ధతుల ద్వారా బోధనను కొనసాగించాలని త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనా రెడ్డి సూచించారు. శనివారం తెలుగు వర్శిటీలో దివంగత మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం మాతృభాషా దినోత్సవాన్ని, 2026 సంవత్సరపు సంస్కృతి పురస్కార ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్. ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ లలితకళల ద్వారా విద్యార్ధి జీవితాన్ని అనుసంధానిస్తూ లోకజ్ఞానాన్ని అందించే విధంగా సాంకేతిక విద్యాపాఠ్యప్రణాళికలను తెలుగు విశ్వవిద్యాలయంరూపొందించాలని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారుడు డా. కె.వి.రమణాచారి మాట్లాడుతూ, రాజకీయమంటే ప్రజాసేవనే అని ప్రగాఢంగా నమ్మే నిస్వార్ధపూరిత నిజమైన రాజకీయ నాయకుడు మండలి వెంకట కృష్ణారావు అని గుర్తు చేశారు. అవనిగడ్డ శాసన సభ్యులు డా. మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ..దేశంలో అనేకప్రాంతాల్లో తెలుగువారు అత్యున్నత స్థానంలో ఉన్నారని వారందరూ తనదైన శైలిలో తెలుగు భాషా సంస్కృతులను కాపాడుతున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనం00⁰⁰తంరం మండలి వెంకట కృష్ణారావు పేరిట నెలకొల్పిన సంస్కృతి పురస్కారాన్ని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి
పూనె ఆంధ్రసంఘం సలహాదారు తిరువలూరి వంగీపురం శ్రీనివాస్ కు ఇరవై అయిదువేల నగదు పారితోషికంతో పాటు ప్రత్యేక జ్ఞాపిక, శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి
విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు అధ్యక్షత వహించారు.





