ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

ఆదివారం13 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:20 pm

ఆదివారం

13 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:20 pm

SENSEX74,782-1.77%
NIFTY23,398-1.60%
హైదరాబాద్ 22K₹1,44,640/10g+0.34%
హైదరాబాద్ 24K₹1,57,789/10g+0.34%
వెండి₹2,16,278/kg-1.67%

తాజా వార్తలు

తెలంగాణ క్రికెట్‌కు ఫుల్‌ మెంబర్‌షిప్‌ ఇవ్వాలి బాంబే హైకోర్టు, బీసీసీఐ ముందు టీసీఏ న్యాయపోరాటం

The Telangana Cricket Association (TCA) has intensified its legal battle in the Bombay High Court and before the BCCI, demanding full membership to ensure fair representation for players across all 32 districts.

nagendra13 September 2026, 2:58 AM0 చూసులుtrinetnews.com
తెలంగాణ క్రికెట్‌కు ఫుల్‌ మెంబర్‌షిప్‌ ఇవ్వాలి  బాంబే హైకోర్టు, బీసీసీఐ ముందు టీసీఏ న్యాయపోరాటం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్‌, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 12: తెలంగాణ క్రికెట్‌కు ఫుల్‌ మెంబర్‌షిప్‌ కల్పించాలనే డిమాండ్‌తో తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ (టీసీఏ) న్యాయపోరాటాన్ని ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్‌ అభివృద్ధికి ప్రస్తుత వ్యవస్థ అడ్డంకిగా మారిందని టీసీఏ ఆరోపించింది. ఈ అంశంపై బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో పాటు ఈ నెల 7న బీసీసీఐ నాయకత్వం, బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు సమగ్ర ప్రాతినిధ్యం సమర్పించినట్లు టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువా రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఒక నగర కేంద్రంగా ఉన్న సంఘానికి ఫుల్‌ మెంబర్‌షిప్‌ హక్కులు కొనసాగుతుండగా, 32 జిల్లాల్లోని క్రికెటర్లకు సమానమైన అవకాశాలు అందడం లేదని ఆయన పేర్కొన్నారు. ‘ఒక రాష్ట్రం–ఒక ఫుల్‌ మెంబర్‌’ విధానాన్ని పునఃపరిశీలించి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే విధంగా క్రికెట్‌ పరిపాలన ఉండాలని కోరారు. బీసీసీఐ రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఫుల్‌ మెంబర్‌గా కొనసాగేందుకు అవసరమైన అర్హతలు, ఆర్థిక వ్యవహారాలు, పరిపాలన, పాలనా విధానాలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని టీసీఏ తెలిపింది. హెచ్‌సీఏకు సంబంధించిన ఆర్థిక, పాలనా అంశాలతో పాటు న్యాయపరమైన పరిణామాలను కూడా సంబంధిత సంస్థల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొంది. హెచ్‌సీఏ ఎన్నికల్లో క్లబ్‌ల అర్హత, ప్రాతినిధ్యం, కొన్ని క్లబ్‌ల భాగస్వామ్యంపై గతంలో వచ్చిన అభ్యంతరాలను కూడా బీసీసీఐ, న్యాయ సంస్థల దృష్టికి తీసుకెళ్లామని గురువా రెడ్డి తెలిపారు. అయితే తమ పోరాటం వ్యక్తులకు వ్యతిరేకం కాదని, సంస్థాగత పారదర్శకత, జవాబుదారీతనం, ఆర్థిక క్రమశిక్షణ కోసమేనని స్పష్టం చేశారు. 2014 నుంచి తెలంగాణలోని జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్‌ అభివృద్ధికి టీసీఏ పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం సహా అన్ని జిల్లాల యువ క్రికెటర్లకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా స్థాయిలో క్రికెట్‌ మౌలిక వసతులు, ప్రతిభావంతులకు అవకాశాలు పెంచేందుకు రాష్ట్రవ్యాప్త వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ క్రికెట్‌ హైదరాబాద్‌కే పరిమితం కాదని, రాష్ట్రంలోని ప్రతి జిల్లా క్రికెటర్‌కు సమాన అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని గురువా రెడ్డి అన్నారు. ఫుల్‌ మెంబర్‌షిప్‌ అంశంపై కోర్టులు, బీసీసీఐ, సంబంధిత అధికారిక సంస్థల ముందు తమ వాదనను కొనసాగిస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి   కృషి  తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి

Telangana State Council of Higher Education Chairman Prof. V. Balakista Reddy stated that the government is working to strengthen the education system during a graduation ceremony in Hyderabad.

మిగతా చదవండి →