హైదారాబాద్, ట్రైన్ నైట్ న్యూస్,
ఆగస్టు:31 : డాక్టర్ ఏ.ఎస్. రావు నగర్ డివిజన్‌కు సంబంధించిన గణేష్ ఉత్సవ సమితి నూతన కన్వీనర్‌గా శ్రీ తాడూరి కిరణ్ కుమార్‌ను గణేష్ ఉత్సవ సమితి ఫౌండర్లు, మాజీ కన్వీనర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు ధార్మిక సంఘాల ప్రతినిధుల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయడం కోసం గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఈరోజు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ (అడ్మిన్ ఎస్ఐ సుధాకర్) మరి డివిజన్ ఎస్ఐ అధికారులను కలిసి సమాచారం అందించడం జరిగింది.
రాబోయే గణేష్ ఉత్సవ కార్యక్రమాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో మరియు సమన్వయంతో నిర్వహించేందుకు పోలీస్ శాఖ నుండి సహాయ సహకారాలు అందించాలని గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కోరారు.
అలాగే డివిజన్‌లో గణేష్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అవసరమైన సమాచారం, సూచనలు మరియు సహకారాన్ని సమితికి తెలియజేయాలని పోలీస్ అధికారులను కోరడం జరిగింది. పాల్గొన్నవారు : బి. పుల్లారెడ్డి, కె. రమేష్ యాదవ్, నీరుకొండ సతీష్,తాడూరిగగన్ కుమార్, జి. ఆదినారాయణ చౌదరి, రామ్ సాగర్ కిషోర్ చారి,జి నరసింహ చారి, ఎస్. ఉమేష్, ఏ.మహేష్, పి.ప్రణయ్ పి.ప్రవీణ్ మొదలైన వారు పాల్గొన్నారు
ఇట్లు,
*తాడూరి గగన్ కుమార్* గణేష్ ఉత్సవ సమితి
డాక్టర్ ఏ.ఎస్. రావు నగర్ డివిజన్ కన్వీనర్





