Monday9 November 2026హైదరాబాద్

SENSEX81,080+5.41%
NIFTY24,996+4.98%
HYD 22K₹1,32,331/10g+0.73%
भाषाएँ

Latest News

అంతర్జాతీయ ‘మిస్ అండ్ మిస్టర్ ప్లానెట్’ పోటీలకు ఇండియా, అమెరికా నేషనల్ డైరెక్టర్‌గా బిగ్‌బాస్ విజేత కౌశల్ మండ! భారతదేశం తరఫున ఈషాన్ యెల్డే, అశ్రిత నీలకంఠం.. అమెరికా తరఫున తన్వి పడాల ఎంపిక

nagendra9 November 2026, 3:29 AM2 व्यूtrinetnews.com
అంతర్జాతీయ ‘మిస్ అండ్ మిస్టర్ ప్లానెట్’ పోటీలకు ఇండియా, అమెరికా నేషనల్ డైరెక్టర్‌గా బిగ్‌బాస్ విజేత కౌశల్ మండ! భారతదేశం తరఫున ఈషాన్ యెల్డే, అశ్రిత నీలకంఠం.. అమెరికా తరఫున తన్వి పడాల ఎంపిక

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో గత 25 సంవత్సరాలుగా విశేష గుర్తింపు, ప్రజాదరణ పొందిన ప్రతిష్ఠాత్మక ‘మిస్ అండ్ మిస్టర్ ప్లానెట్’ అంతర్జాతీయ అందాల పోటీలకు భారతదేశం, అమెరికా నేషనల్ డైరెక్టర్‌గా ప్రముఖ నటుడు, మోడల్, బిగ్‌బాస్ తెలుగు సీజన్-2 విజేత కౌశల్ మండ ఎంపిక కావడం భారతీయులందరికీ గర్వకారణమని పలువురు అభినందిస్తున్నారు.

మోడలింగ్, ఫ్యాషన్, నటన రంగాల్లో సుమారు 30 సంవత్సరాల అపార అనుభవం కలిగిన కౌశల్ మండ ఇప్పటివరకు వేలాది మోడలింగ్ షూట్స్‌లో పనిచేయడంతో పాటు, 3,000 మందికి పైగా మోడల్స్‌కు శిక్షణ అందించారు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ఫ్యాషన్ షోలు, ప్రకటనలు, అందాల పోటీలతో ఆయనకు విశేష అనుబంధం ఉంది. ఇంతటి అనుభవం, ప్రతిభ కలిగిన కౌశల్ మండకు రెండు దేశాల నేషనల్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించడం విశేషం.

నేషనల్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే భారతదేశంతో పాటు అమెరికాలోని ప్రతిభావంతులైన మోడల్స్‌ను గుర్తించి, వారికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించి, ప్రపంచ వేదికపై ఆయా దేశాలకు ప్రాతినిధ్యం వహించేలా తీర్చిదిద్దే బాధ్యతను కౌశల్ మండ చేపట్టారు.

ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వచ్చిన అనేకమంది అభ్యర్థుల ఫొటోలు, వివరాలను పరిశీలించి, కఠినమైన స్క్రూటినీ అనంతరం ప్రతిభావంతులను ఎంపిక చేశారు.

భారతదేశం తరఫున ఎంపికైనవారు:

ఈషాన్ యెల్డే (19 సంవత్సరాలు): ఆరడుగుల రెండు అంగుళాల ఎత్తు కలిగిన ఈషాన్‌ను మిస్టర్ ప్లానెట్ పోటీలకు ఎంపిక చేశారు. శారీరకంగా, మానసికంగా మోడలింగ్ రంగానికి ఎంతో అనుకూలమైన ప్రతిభ కలిగిన ఈషాన్, ఇటీవల నిర్వహించిన మిస్టర్ టీన్స్ సౌత్ ఇండియా పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచాడు. తన ప్రతిభ, వ్యక్తిత్వం, ఫిట్‌నెస్‌తో అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి మంచి పేరు తీసుకురాగలడనే నమ్మకంతో కౌశల్ మండ ఆయనను ఎంపిక చేశారు.

అశ్రిత నీలకంఠం: హైదరాబాద్‌కు చెందిన మెడికల్ విద్యార్థిని అశ్రిత నీలకంఠంను మిస్ ప్లానెట్ పోటీలకు భారతదేశం తరఫున ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన మిస్ టీన్స్ సౌత్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచిన అశ్రిత, తన అందం, ఆత్మవిశ్వాసం, వాక్చాతుర్యం, ప్రశ్నలకు సమాధానాలు చెప్పే విధానంతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభతో భారతదేశానికి మంచి గుర్తింపు తీసుకురాగలదనే విశ్వాసంతో ఆమెను ఎంపిక చేశారు.

అమెరికా తరఫున ఎంపికైనవారు:

తన్వి పడాల: ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తు కలిగిన మెడికల్ విద్యార్థిని తన్వి పడాలను అమెరికా తరఫున మిస్ ప్లానెట్ పోటీలకు ఎంపిక చేశారు. ఈ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చి కౌశల్ మండ వద్ద మోడలింగ్ శిక్షణ పొందడం విశేషం. గత రెండు నెలలుగా ఆమెకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేశారు.

ఈ ముగ్గురు ప్రతిభావంతులను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు గత రెండు నెలలుగా కౌశల్ మండ ఆధ్వర్యంలో కఠినమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ స్ట్రెంత్, ర్యాంప్ వాక్, స్టేజ్ ప్రెజెన్స్, సెల్ఫ్ ఇంట్రడక్షన్, ప్రశ్నలు-సమాధానాలు, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

జార్జియాలోని టిబిలిసిలో నవంబర్ 11 నుంచి 16 వరకు ‘మిస్ అండ్ మిస్టర్ ప్లానెట్’ అంతర్జాతీయ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో భారతదేశం తరఫున ఈషాన్ యెల్డే, అశ్రిత నీలకంఠం, అమెరికా తరఫున తన్వి పడాల పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా కౌశల్ మండ మాట్లాడుతూ.. “భారతదేశంలో ఎంతో ప్రతిభ కలిగిన మోడల్స్ ఉన్నారు. వారికి సరైన గుర్తింపు, శిక్షణ, అంతర్జాతీయ వేదికపై తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కల్పించాలన్నదే నా లక్ష్యం. గత రెండు నెలలుగా ఈ ముగ్గురు అభ్యర్థులకు ఎంతో కష్టపడి శిక్షణ అందించాం. ర్యాంప్ వాక్ నుంచి ప్రశ్నోత్తరాల వరకు ప్రతి అంశంలోనూ వారిని సిద్ధం చేశాం. అంతర్జాతీయ వేదికపై వీరు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, తమ దేశాలకు కిరీటాలు తీసుకురావాలని ఆశిస్తున్నాను. వారి ప్రతిభపై నాకు పూర్తి నమ్మకం ఉంది” అని తెలిపారు.

భారతదేశం నుంచి అంతర్జాతీయ అందాల పోటీలకు యువ ప్రతిభను పరిచయం చేస్తూ, వారికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి కౌశల్ మండ చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు.

ఈ ముగ్గురు యువ ప్రతిభావంతులు అంతర్జాతీయ వేదికపై అద్భుతమైన ప్రదర్శన కనబరిచి విజేతలుగా నిలిచి, భారతదేశానికి మరియు అమెరికాకు కిరీటాలు తీసుకురావాలని, దేశాలకు గర్వకారణంగా నిలవాలని అందరం మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం.

यह भी पढ़ें

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

और पढ़ें →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

और पढ़ें →