Monday9 November 2026హైదరాబాద్

SENSEX81,080+5.41%
NIFTY24,996+4.98%
HYD 22K₹1,32,331/10g+0.73%
भाषाएँ

Latest News

మెట్టుగూడలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.ర్యాల రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు.

nagendra9 November 2026, 3:27 AM1 व्यूtrinetnews.com
మెట్టుగూడలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.ర్యాల రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు.

Share this story

Share link keeps your language (?lang=)

ట్రైన్ నైట్ న్యూస్ సికింద్రాబాద్.నవంబర్:08/11/2026

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మెట్టుగూడ డివిజన్‌లో ఉన్న సెయింట్ ఆన్స్ ప్రేమ్ నివాస్ హోమ్ ఫర్ ది స్ట్రీట్‌లో ఘనంగా నిర్వహించారు.

సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ జనరల్ సెక్రటరీ ర్యాల రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు సికింద్రాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని నాయకులు కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బెన్న ఆంథోనీ, ప్రీతివ్ రాజ్, శ్రీను రెడ్డి, శైలేష్, అబ్దుల్ భాయ్, రఘు శ్రీను, టెంపుల్ శ్రీను, శ్రీధర్ రెడ్డి, గడ్డం మహేందర్, దీపక్, రఘు, వినయ్, గుంటి కృష్ణ, రాము, హనుమంతు రెడ్డి, రాజు, మహిళా నాయకురాళ్లు రూప, రూత్ క్లారి, కస్తూరి, సంతోషి తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

यह भी पढ़ें

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

और पढ़ें →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య