Monday9 November 2026Hyderabad

SENSEX80,893+5.17%
NIFTY24,998+4.98%
HYD 22K₹1,32,473/10g+0.83%
Languages

Latest News

చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రాకర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం .భారీగా చెలరేగిన మంటలు. ఉలిక్కిపడ్డ సికింద్రాబాద్ ప్రజలు.

nagendra9 November 2026, 3:24 AM1 viewstrinetnews.com
చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రాకర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం .భారీగా చెలరేగిన మంటలు. ఉలిక్కిపడ్డ సికింద్రాబాద్ ప్రజలు.

Share this story

Share link keeps your language (?lang=)

ట్రైన్ నైట్ న్యూస్ సికింద్రాబాద్.నవంబర్:08/11/2026

DBR షోరూం పక్కనే ప్రమాదం.. పూర్తిగా బూడిదైన బాణసంచా చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీబీఆర్ షోరూం పక్కన ఏర్పాటు చేసిన క్రాకర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బాణసంచా భారీ శబ్దాలతో పేలుతూ పూర్తిగా కాలిపోయి బూడిదైంది. మంటలు, పేలుళ్లతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో ఒక్కసారిగా సికింద్రాబాద్ ప్రజలు ఉలిక్కిపడ్డారు*

ఈ ఏడాది జనావాసాల మధ్య, రద్దీ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లపై పెద్ద సంఖ్యలో క్రాకర్ దుకాణాలు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి దుకాణాల వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా ఉండాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ప్రమాదంపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాలి ఉంది

అగ్నిప్రమాదానికి గల కారణాలేమిటి సంబంధిత దుకాణానికి అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా నిల్వ ఉంచారా? ప్రాణనష్టం లేదా గాయాలు ఏమైనా సంభవించాయా? ఆస్తి నష్టం ఎంత జరిగింది? అనే వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడి ఉంది.

Also read