సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX80,893+5.17%
NIFTY24,998+4.98%
22K₹1,32,473/10g+0.83%
భాషలు

తాజా వార్తలు

ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపడమే దీపావళి అసలైన స్ఫూర్తి!: గవర్నర్

nagendra8 November 2026, 7:44 AM1 చూసులుtrinetnews.com
ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపడమే దీపావళి అసలైన స్ఫూర్తి!: గవర్నర్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

-ప్రేమానురాగాలు, సేవాభావం, పరస్పర సహకారంతో పండుగ జరుపుకోవాలి

స్వదేశీ ఉత్పత్తులను, సంప్రదాయ కళాకారులను ప్రోత్సహించాలి*

-అయోధ్య దీపోత్సవం స్పూర్తి తో ప్రతి ఇంటిలోనూ దీపాలు వెలిగించడం ఒక సంప్రదాయంగా మారాలి*

*తెలంగాణ ప్రజలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దీపావళి శుభాకాంక్షలు*

-లోక్‌భవన్ పరివారంతో గవర్నర్ దంపతుల దీపావళి సంబరాలు.

- ఉద్యోగులకు మిఠాయిలు ,కానుకల పంపిణీ

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 7:

దీపావళి అంటే కేవలం మన ఇళ్లలో దీపాలు వెలిగించుకోవడం మాత్రమే కాదని, ఇతరుల జీవితాల్లోనూ ఆనంద జ్యోతులు నింపడమే పండుగ అసలైన స్ఫూర్తి అని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. మన సంతోషాలను ఇతరులతో పంచుకుంటూ, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచినప్పుడే పండుగకు నిజమైన సార్థకత చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రేమానురాగాలు, సేవాభావం, పరస్పర సహకారం, సానుకూల ఆలోచనలు, స్వదేశీ సంకల్పంతో దీపావళిని జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

శనివారం సాయంత్రం లోక్‌భవన్‌లో ఘనంగా నిర్వహించిన ముందస్తు దీపావళి వేడుకల్లో గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, వారి సతీమణి జానకి శుక్లా లోక్‌భవన్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మమేకమయ్యారు.

అధర్మం పై ధర్మం సాధించిన విజయాలకు గుర్తుగా గవర్నర్ అధికారులతో కలిసి

క్రాకర్ లు కాల్చారు.

ఈ సందర్భంగా ఉద్యోగులకు పండుగ కానుకలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులు సైతం గవర్నర్ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ ఉద్యోగులు , సిబ్బందికి దీపావళి పండుగ సందేశాన్ని ఇచ్చారు

చీకటిపై వెలుగు.. అజ్ఞానంపై జ్ఞానం.. చెడుపై మంచి విజయం

దీపావళి చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని గవర్నర్ పేర్కొన్నారు. 'శుభం కరోతి కల్యాణం ఆరోగ్యం ధనసంపద...' అనే ప్రార్థనను ప్రస్తావిస్తూ, దీపజ్యోతి శుభం, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించే పవిత్ర పర్వదినం దీపావళి అని వివరించారు. శత్రువుల నాశనం కోరుకోవడం కంటే ద్వేషభావాలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోవాలని ప్రార్థించడమే దీపావళి సందేశమని అన్నారు. ఒక చిన్న దీపం చీకటిని తొలగించినట్లే, సానుకూల ఆలోచనలు, సద్భావన సమాజంలోని ప్రతికూలతలను దూరం చేయగలవని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, సుఖశాంతులు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

ఇతరుల జీవితాల్లోనూ వెలుగులు నింపాలి

దీపావళి స్ఫూర్తి మన జీవితాలకు మాత్రమే పరిమితం కాకుండా, ఇతరుల జీవితాల్లోనూ వెలుగులు నింపాలని గవర్నర్ అన్నారు. సమాజంలోని పేదలు, నిరుపేదలు, కష్టాల్లో ఉన్నవారితో సంతోషాలను పంచుకోవాలని సూచించారు. ఒక చిన్న పలకరింపు, ఆత్మీయంగా పలికే ఓదార్పు మాట కూడా ఇతరులకు ఎంతో ఆనందాన్ని, మానసిక ధైర్యాన్ని అందించగలవని పేర్కొన్నారు. అయోధ్యలో నిర్వహిస్తున్న ఘనమైన దీపోత్సవ వేడుకల్లో సుమారు 30 లక్షల దీపాలను వెలిగిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రతి ఇంటిలోనూ దీపాలు వెలిగించడం ఒక సంప్రదాయంగా మారాలని ఆకాంక్షించారు.

మట్టి ప్రమిదల వినియోగంతో స్వదేశీ కళాకారులకు ప్రోత్సాహం

స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గవర్నర్ అన్నారు. అయోధ్య దీపోత్సవం సందర్భంగా మట్టి ప్రమిదలకు పెరిగిన డిమాండ్ పరిసర గ్రామాల్లోని సంప్రదాయ కుమ్మరులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారు. కొవ్వొత్తులకు బదులుగా మట్టి ప్రమిదలను వినియోగించడం ద్వారా స్థానిక కళాకారులు, సంప్రదాయ చేతివృత్తుల వారికి చేయూతనివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పండుగల వెనుక ఉన్న అంతరార్థాన్ని తెలుసుకొని, మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి*

ఆదివారం రుపుకోనున్న దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో పాటు సురక్షితంగా జరుపుకోవాలని గవర్నర్ సూచించారు. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

సమయపాలన, క్రమశిక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

నిత్యజీవితంలోనే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలోనూ సమయపాలన, క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను అంకితభావంతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సమయపాలన, క్రమశిక్షణలో పోలీసు, సైనిక సిబ్బంది ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్ మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటారని అన్నారు. గవర్నర్ ప్రత్యేక చొరవతో లోక్ భవన్ లో లోక్ భవన్ ఉద్యోగులతో మమేకమై పెద్ద ఎత్తున దీపావళి వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, వారి సతీమణి అపర్ణ, సంయుక్త కార్యదర్శి శ్రీ కె. శశికిరణాచారి, ఏడీసీ కాంతి లాల్, అమన్ కుందూ, ఓఎస్డీ శేషగిరిరావు, డిప్యూటీ సెక్రటరీ జి. పల్లవి, అసిస్టెంట్ సెక్రటరీ కె మురళీ చార్యులు,ప్రెస్ సెక్రటరీ మామిండ్ల దశరథం తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

మిగతా చదవండి →