Monday9 November 2026Hyderabad

SENSEX81,080+5.41%
NIFTY24,996+4.98%
HYD 22K₹1,32,331/10g+0.73%
Languages

Latest News

ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపుదాం: ఓం బిర్లా దీపావళి, గోవర్ధన పూజ, భాయ్‌ దూజ్‌ శుభాకాంక్షలు తెలిపిన లోక్‌సభ స్పీకర్‌

nagendra8 November 2026, 7:41 AM2 viewstrinetnews.com
ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపుదాం: ఓం బిర్లా దీపావళి, గోవర్ధన పూజ, భాయ్‌ దూజ్‌ శుభాకాంక్షలు తెలిపిన లోక్‌సభ స్పీకర్‌

Share this story

Share link keeps your language (?lang=)

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్‌, నవంబర్‌ 7:

దీపావళి పర్వదినం సందర్భంగా ఇతరుల జీవితాల్లో ఆశ, విశ్వాసం, ఆనందాల వెలుగులు నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు దీపావళి, గోవర్ధన పూజ, భాయ్‌ దూజ్‌ పండుగల శుభాకాంక్షలు తెలిపారు.

దీపావళి కేవలం దీపాలు వెలిగించి సంబరాలు చేసుకునే పండుగ మాత్రమే కాదని, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచి సంతోషాన్ని పంచుకునే అవకాశమని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. దీపం తాను వెలుగుతూ పరిసరాలకు కాంతిని పంచినట్లే, మన ఆనందం ఇతరుల జీవితాల్లోనూ సంతోషాన్ని నింపాలని సూచించారు.

మన కుటుంబాలతోపాటు ఆర్థిక, ఇతర ఇబ్బందులతో పండుగ ఆనందాలకు దూరమైన వారి ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావాలని కోరారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తూ సమాజంలో ప్రేమ, సామరస్యం, పరస్పర సహకారాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. మన చుట్టూ ఎవరూ ఒంటరితనం, నిరాదరణకు గురికాకుండా చూసినప్పుడే దీపావళికి నిజమైన సార్థకత లభిస్తుందని తెలిపారు.

దేశ సరిహద్దులను కాపాడుతున్న వీర సైనికులు, అన్నదాతలు, దేశ నిర్మాణంలో నిమగ్నమైన కార్మికులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రైతుల జీవితాలు సమృద్ధిగా ఉండాలని, యువతకు కొత్త అవకాశాలు లభించాలని, వ్యాపార, పారిశ్రామిక రంగాలు పురోగమిస్తూ భారత్‌ ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం కావాలని ఓం బిర్లా అభిలషించారు.

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య