సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX80,893+5.17%
NIFTY24,998+4.98%
22K₹1,32,473/10g+0.83%
భాషలు

తాజా వార్తలు

డ్రగ్స్‌ ముఠాల మూలాలపై దాడి చేయాలి: అమిత్‌ షా సరిహద్దు, తీర భద్రత బలోపేతం.. సైబర్‌ నేరాల నియంత్రణకు ఆదేశాలు

nagendra8 November 2026, 7:37 AM0 చూసులుtrinetnews.com
డ్రగ్స్‌ ముఠాల మూలాలపై దాడి చేయాలి: అమిత్‌ షా సరిహద్దు, తీర భద్రత బలోపేతం.. సైబర్‌ నేరాల నియంత్రణకు ఆదేశాలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్‌, నవంబర్‌ 7:

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై చర్యలు చిన్నస్థాయి విక్రేతలకే పరిమితం కాకుండా మొత్తం నెట్‌వర్క్‌, ప్రధాన సూత్రధారులను లక్ష్యంగా చేసుకోవాలని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌ షా ఆదేశించారు. ఆర్థిక దర్యాప్తులకు ప్రాధాన్యం ఇచ్చి అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. శనివారం అహ్మదాబాద్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో గుజరాత్‌ శాంతిభద్రతలు, అంతర్గత భద్రతా పరిస్థితిని సమీక్షించారు.

పాకిస్థాన్‌తో అంతర్జాతీయ సరిహద్దు, దాదాపు 2,340 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న గుజరాత్‌లో నిఘాను మరింత పటిష్ఠం చేయాలని అమిత్‌ షా పేర్కొన్నారు. సరిహద్దు భద్రతా దళం, రాష్ట్ర పోలీసులు, తీర రక్షక దళం, కేంద్ర సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

కొత్త నేర చట్టాల అమలులో రాష్ట్ర పనితీరును అభినందించారు. పెండింగ్‌లో ఉన్న 25 వేలకు పైగా ఫోరెన్సిక్‌ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. సైబర్‌ నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎస్‌4సీ, 1930 హెల్ప్‌లైన్‌ సామర్థ్యాన్ని పెంచాలని తెలిపారు.

ఉగ్రవాద నిరోధక సంస్థలను బలోపేతం చేయడంతోపాటు దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించి, చట్టప్రకారం స్వదేశాలకు పంపే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రత్యేక చర్యల్లో భాగంగా 2,412 మంది అక్రమ విదేశీయులను వెనక్కి పంపిన చర్యలను అభినందించారు.

విపత్తు నిర్వహణ, అగ్నిమాపక భద్రత, అహ్మదాబాద్‌ పట్టణ వరద నిర్వహణ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. శత్రు ఆస్తుల సర్వే, పరిష్కార ప్రక్రియపైనా దృష్టి సారించాలని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర సంస్థలు నిర్దేశిత లక్ష్యాల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలని సూచించారు. సురక్షితమైన, అభివృద్ధి చెందిన, మాదకద్రవ్య రహిత గుజరాత్‌ ద్వారా భద్రమైన భారత్‌ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

సమావేశంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, ఉపముఖ్యమంత్రి హర్ష్‌ సంఘవీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య