Monday9 November 2026హైదరాబాద్

SENSEX81,080+5.41%
NIFTY24,996+4.98%
HYD 22K₹1,32,331/10g+0.73%
भाषाएँ

Latest News

సరిహద్దుల్లో సైనిక సన్నద్ధతపై రాజ్‌నాథ్‌ సమీక్ష ఆధునిక యుద్ధ సవాళ్లపై అప్రమత్తంగా ఉండాలని సైనికులకు పిలుపు

nagendra8 November 2026, 7:35 AM0 व्यूtrinetnews.com
సరిహద్దుల్లో సైనిక సన్నద్ధతపై రాజ్‌నాథ్‌ సమీక్ష ఆధునిక యుద్ధ సవాళ్లపై అప్రమత్తంగా ఉండాలని సైనికులకు పిలుపు

Share this story

Share link keeps your language (?lang=)

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్‌, నవంబర్‌ 7:

పశ్చిమ బెంగాల్‌లోని సుక్నాలో త్రిశక్తి కోర్‌ కార్యాచరణ సన్నద్ధతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శనివారం సమీక్షించారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి మౌలిక వసతుల అభివృద్ధి, అధునాతన సైనిక పరికరాలు, నూతన సాంకేతికతల వినియోగంపై ఉన్నతాధికారులు ఆయనకు వివరించారు. కోర్‌ సన్నద్ధతపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి.. సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలతో స్థానిక ప్రజలతో సంబంధాలను బలోపేతం చేస్తున్న సైన్యాన్ని అభినందించారు.

దీపావళి సందర్భంగా సైనికులతో కలిసి నిర్వహించిన బడాఖానా కార్యక్రమంలో రాజ్‌నాథ్‌ పాల్గొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనికుల ధైర్యసాహసాలు, వృత్తి నైపుణ్యం, అంకితభావాన్ని కొనియాడారు. ముందువరుస స్థావరాలకు ఆయుధాలు, ఆహారం, మందులు, సిబ్బందిని చేరవేయడంలో సుక్నా కీలక కేంద్రమని పేర్కొన్నారు. తూర్పు భారత భద్రతా వ్యవస్థలో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యముందని, సైనికులకు నిత్యావసరాల సరఫరాను నిరంతరం అందించేందుకు ప్రభుత్వం సరఫరా వ్యవస్థలను బలోపేతం చేస్తోందన్నారు.

రహదారులు, సొరంగాలు, సరిహద్దు మౌలిక వసతులు, ఆధునిక పరికరాలకు బడ్జెట్‌ కేటాయింపులు పెంచినట్లు తెలిపారు. దేశీయ అంకుర సంస్థలు, పరిశ్రమలు డ్రోన్లు, యాంటీ డ్రోన్‌ వ్యవస్థలు, అధునాతన పరికరాలను తయారు చేస్తున్నాయని చెప్పారు. సైనికులు డ్రోన్‌ నిర్వహణ, సైబర్‌ భద్రత, నూతన విధానాల్లో శిక్షణ పొందడం భవిష్యత్‌ సవాళ్లను ఎదుర్కొనేందుకు దోహదపడుతుందన్నారు.

ఆధునిక యుద్ధం సంప్రదాయ పోరాటాలకే పరిమితం కావడం లేదని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. మిశ్రమ యుద్ధ వ్యూహాలు, పరోక్ష యుద్ధాలు, సైబర్‌ దాడులు, డ్రోన్‌ చొరబాట్లు, సమాచార యుద్ధం వంటి ముప్పులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వదంతుల వ్యాప్తి, డ్రోన్లతో సున్నిత ప్రాంతాలపై నిఘా, సైనిక వ్యవస్థల్లోకి చొరబడే ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కోవాలన్నారు.

సైనికుల మానసిక ఆరోగ్యం, భావోద్వేగ సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. ఒత్తిడిని దాచుకోకుండా సహచరులతో మాట్లాడి అవసరమైన సహాయం పొందాలని సూచించారు. అధికారులు సైనికులతో సమయం గడిపి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలన్నారు. ఈశాన్య భారతాన్ని దేశానికి తొలి అంచుగా అభివర్ణిస్తూ, అక్కడి ప్రకృతి సంపద, సాంస్కృతిక వైవిధ్యం భారతీయ గుర్తింపులో అంతర్భాగమని తెలిపారు.

కార్యక్రమంలో సైన్యాధిపతి జనరల్‌ ధీరజ్‌ సేథ్‌, తూర్పు కమాండ్‌ అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ వీఎంబీ కృష్ణన్‌, 33 కోర్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మన్‌రాజ్‌ సింగ్‌ మాన్‌ తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

और पढ़ें →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

और पढ़ें →