సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,080+5.41%
NIFTY24,996+4.98%
22K₹1,32,331/10g+0.73%
భాషలు

తాజా వార్తలు

ఎఫఎంజీ ఇంటర్న్స్ నిరసనకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు యువ వైద్యుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి: బుర్ర రాము గౌడ్‌

nagendra8 November 2026, 7:25 AM0 చూసులుtrinetnews.com
ఎఫఎంజీ ఇంటర్న్స్ నిరసనకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు యువ వైద్యుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి: బుర్ర రాము గౌడ్‌

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్‌, ట్రైనెట్ న్యూస్, నవంబర్‌ 7:

విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి స్వదేశంలో వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్న ఎఫఎంజీ (ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌) ఇంటర్న్స్‌ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బుర్ర రాము గౌడ్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద ఎఫఎంజీ ఇంటర్న్స్‌ తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ తెలంగాణ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిరసన కార్యక్రమానికి హాజరైన బుర్ర రాము గౌడ్‌ మాట్లాడుతూ.. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి దేశానికి తిరిగి వచ్చిన యువ వైద్యుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఇంటర్న్స్‌తో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. నిరసనకారులను అణచివేయడం కాకుండా వారి వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. ఎఫఎంజీ ఇంటర్న్స్‌కు మద్దతుగా ఐఎంజీ ఇంటర్న్స్‌ కూడా ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎఫఎంజీ , ఐఎంజీ ఇంటర్న్స్‌ మధ్య ఐక్యత మరింత బలపడాలని, తెలంగాణలో జరుగుతున్న ఈ పోరాటానికి దేశంలోని ఇతర రాష్ట్రాల వైద్య ఇంటర్న్స్‌ కూడా సంఘీభావం ప్రకటించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలోనూ ఆప్ విధానాలు అమలు చేయాలి

ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలు విద్య, వైద్యం, యువత సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని బుర్ర రాము గౌడ్‌ తెలిపారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలో ఢిల్లీలో, భగవంత్‌ మాన్‌ నాయకత్వంలో పంజాబ్‌లో అమలవుతున్న విధానాలను ప్రస్తావిస్తూ.. పంజాబ్‌లో వైద్య ఇంటర్న్స్‌కు సుమారు రూ.22 వేల స్టైపెండ్‌ అందిస్తున్నారని పేర్కొన్నారు. యువ వైద్యుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. యువ వైద్యులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఏర్పడటం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ఇంటర్న్స్‌ ప్రతినిధులతో చర్చించి వారి సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎఫఎంజీ ఇంటర్న్స్‌ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, శాంతియుత నిరసన చేస్తున్న వారిపై ఎలాంటి వేధింపులకు పాల్పడకూడదని, ఎఫఎంజీ , ఐఎంజీ ప్రతినిధులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ డిమాండ్‌ చేసింది. దేశవ్యాప్తంగా ఎఫఎంజీ ఇంటర్న్స్‌ ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరింది. ఈ కార్యక్రమంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నాయకులు ఎం. శివాజీ, కొడంగల్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొని నిరసన చేస్తున్న వైద్య ఇంటర్న్స్‌కు సంఘీభావం తెలిపారు. ఎఫఎంజీ , ఐఎంజీ ఇంటర్న్స్‌ ఐక్యతే వారి బలమని, వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఆమ్‌ ఆద్మీ పార్టీ వారికి అండగా నిలుస్తుందని బుర్ర రాము గౌడ్‌ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

మిగతా చదవండి →