సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,080+5.41%
NIFTY24,996+4.98%
22K₹1,32,331/10g+0.73%
భాషలు

తాజా వార్తలు

నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై కసరత్తు.. చైర్మన్లతో పాటు డైరెక్టర్‌ పదవులూ భర్తీ చేస్తాం: మహేష్‌ గౌడ్‌

nagendra8 November 2026, 7:24 AM0 చూసులుtrinetnews.com
నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై కసరత్తు.. చైర్మన్లతో పాటు డైరెక్టర్‌ పదవులూ భర్తీ చేస్తాం: మహేష్‌ గౌడ్‌

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్‌, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 7:

రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌ గౌడ్‌ వెల్లడించారు. చైర్మన్ల పదవులతో పాటు వివిధ సంస్థల్లో డైరెక్టర్‌ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు పదవుల కేటాయింపు అంశంపై కసరత్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.పార్టీలో జరుగుతున్న పరిణామాలు, నాయకుల పనితీరు, పార్టీ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన పూర్తి నివేదికను అధిష్టానానికి అందించినట్లు మహేష్‌ గౌడ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ అధిష్టానం గతంలో మాదిరిగా కాకుండా పార్టీ వ్యవహారాలపై మరింత నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోందని చెప్పారు. నాయకుల పనితీరును అంచనా వేయడానికి ఏఐసీసీలో ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తోందని వెల్లడించారు.

పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన నివేదికలు మూడు రోజుల పాటు ఢిల్లీకి వెళ్లకపోయినా వెంటనే సందేశాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దీన్ని బట్టి పార్టీ కార్యక్రమాలు, నాయకుల పనితీరుపై అధిష్టానం ఎంతటి నిశిత పర్యవేక్షణ చేస్తోందో అర్థమవుతోందన్నారు.

ఇక గవర్నర్‌ కోటాలో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని మహేష్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా అందరూ కలిసి కార్యాచరణ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, పార్టీ వ్యవహారాలపై అధిష్టానం పర్యవేక్షణ వంటి అంశాలపై మహేష్‌ గౌడ్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య