సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,080+5.41%
NIFTY24,996+4.98%
22K₹1,32,331/10g+0.73%
భాషలు

తాజా వార్తలు

ధాన్యం నిల్వకు ఆధునిక సైలోల ఏర్పాటు.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష

nagendra8 November 2026, 7:22 AM0 చూసులుtrinetnews.com
ధాన్యం నిల్వకు ఆధునిక సైలోల ఏర్పాటు.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్‌, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 07:

రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని భద్రంగా, నాణ్యత తగ్గకుండా నిల్వ చేసేందుకు ఆధునిక సైలోల ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా సైలోల ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, వాటి నిర్మాణానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ విధానాలు, నిర్మాణ వ్యయం తదితర అంశాలపై మంత్రి నిపుణులు, పౌర సరఫరాల శాఖ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సంబంధిత ఏజెన్సీల ప్రతినిధుల నుంచి సైలోల నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సాధారణ గిడ్డంగులకు భిన్నంగా భారీ మొత్తంలో ధాన్యాన్ని నేరుగా నిల్వ చేసుకునే ఆధునిక ఉక్కు నిర్మాణాలే సైలోలు. ధాన్యం నిల్వకు ముందే శుభ్రపరిచే, ఆరబెట్టే సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల ధాన్యం నాణ్యతను ఎక్కువ కాలం కాపాడటంతో పాటు నిల్వ సమయంలో నష్టాలను తగ్గించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

సైలోల వినియోగం ద్వారా గోనె సంచుల అవసరాన్ని తగ్గించడంతో పాటు ధాన్యం నిల్వకు అయ్యే ఖర్చులను కూడా గణనీయంగా తగ్గించవచ్చనే అంశాన్ని సమావేశంలో పరిశీలించారు. ఒక్కో సైలో కేంద్రంలో లక్ష టన్నుల (10 లక్షల క్వింటాళ్లు) ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం కల్పించాలని ప్రతిపాదించారు. ఈ విధంగా రాష్ట్రంలో పది సైలో కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం 10 లక్షల టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో ధాన్యం నిల్వ వ్యవస్థ మరింత ఆధునికీకరణ చెందడంతో పాటు నిల్వ సామర్థ్యం పెరగనుంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సురక్షితంగా భద్రపరిచేందుకు, నిల్వ నిర్వహణలో సామర్థ్యాన్ని పెంచేందుకు సైలోల ఏర్పాటు దోహదపడనుంది. ఈ సమీక్ష సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, అదనపు డైరెక్టర్‌ రోహిత్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య