Monday9 November 2026హైదరాబాద్

SENSEX81,053+5.38%
NIFTY25,004+5.01%
HYD 22K₹1,32,435/10g+0.79%
भाषाएँ

Latest News

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ సంకల్పం పేదల ఇళ్లలో దీపావళి వెలుగులు నింపేందుకు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’

nagendra8 November 2026, 7:19 AM0 व्यूtrinetnews.com
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ సంకల్పం పేదల ఇళ్లలో దీపావళి వెలుగులు నింపేందుకు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’

Share this story

Share link keeps your language (?lang=)

లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొననున్న మంత్రి పొంగులేటి

హైద‌రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 7:

రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఇల్లు అనేది కేవలం నాలుగు గోడల నిర్మాణం మాత్రమే కాదని.. ప్రతి పేద కుటుంబానికి ఆత్మగౌరవం, భద్రత, భరోసా కల్పించే చిరునామా అని మంత్రి పేర్కొన్నారు. పేదల కష్టాలను అర్థం చేసుకుని, వారి సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రూపొందించిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాచరణలో పెట్టి, అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్య‌క్ర‌మంపై శ‌నివారం నాడు స‌చివాల‌యంలో హౌసింగ్ అధికారుల‌తో స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ

మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసిందని వివరించారు. విడతలవారీగా ఆర్థిక సహాయం అందిస్తూ పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కల క‌ల‌గానే మిగిలిపోయింద‌ని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ ల‌క్ష‌లాది కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు కేవలం నివాసాన్ని కల్పించడమే కాకుండా వారి కుటుంబాల్లో ఆనందం, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తుపై భరోసా నింపడమే ప్రభుత్వ అసలైన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమానికి రూపకల్పన చేశామని తెలిపారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపుతూ, వారి కుటుంబాలతో కలిసి పండుగ సంతోషాలను పంచుకోవాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం కామంచికల్, నేలకొండపల్లి మండలం కోరట్లగూడెం, కూసుమంచి మండలం పాలేరులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీపావళి వేడుకల్లో పాల్గొననున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో మమేకమై పండుగ సంబరాలను పంచుకోనున్నారు.

यह भी पढ़ें

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

और पढ़ें →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

और पढ़ें →