సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,080+5.41%
NIFTY24,996+4.98%
22K₹1,32,331/10g+0.73%
భాషలు

తాజా వార్తలు

ఉద్యోగ ప్రయాణంలో.. ఉత్సాహమే ఇంధనం మనసు పెట్టి చేసే పనితోనే మనకు గౌరవం

nagendra7 November 2026, 5:31 AM2 చూసులుtrinetnews.com
ఉద్యోగ ప్రయాణంలో.. ఉత్సాహమే ఇంధనం మనసు పెట్టి చేసే పనితోనే మనకు గౌరవం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

సాయంత్రం విధులు ముగించుకొని పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఒక ఉపాధ్యాయుడిని అతని మిత్రుడు "బాగున్నారా" అని పలకరించాడు. "ఏం బాగుండటమో.. రోజూ పాఠశాలకు వెళ్లడం, రావడమే సరిపోతుంది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అలసిపోతున్నాను. ఇంకో నాలుగు సంవత్సరాలకు రిటైర్ అవుతాను. ఆ నాలుగు సంవత్సరాలు ఎంత తొందరగా గడుస్తాయా అని ఎదురు చూస్తున్నాను" అని అన్నాడు.

"మరి ఉద్యోగవిరమణ అయ్యాక ఏం చేస్తావు ఇంట్లో ఉండి?" అని అడిగాడు మిత్రుడు. "ఏముంది. జ్ఞాపకాలు నెమరేసుకుంటూ గడిపేయడమే ఇక' అని అన్నాడు. " అంతలా ఏం జ్ఞాపకాలు ఉంటాయి నీకు?" అని మరో ప్రశ్న సంధించాడా మిత్రుడు. "నేను రిటైర్ అయ్యేనాటికి నా పిల్లలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. నా చిన్ననాటి సంగతులు, బాల్యమిత్రులు, అప్పటి పరిస్థితులతో ఇప్పటి పరిస్థితులను పోలుస్తూ అలా గడిపేస్తా" అని అన్నాడు నవ్వుతూ.

"చిన్ననాటి పరిస్థితులు, బాల్య స్నేహితులు, పిల్లలు, వారి పెంపకం, వారి ఉద్యోగాలు, వాళ్ల పిల్లలు ఇలా ఇవన్నీ నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు. మరి సుమారు ఒక 30 ఏళ్లపాటు నువ్వు చెమటోడ్చి చేసిన నీ ఉద్యోగ జీవితం నీకు ఏమీ జ్ఞాపకాలను మిగల్చ లేదా?" అని అడిగాడు మిత్రుడు.

ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాడు మాస్టారు. "నువ్వు అడిగింది నాకు అర్థం కాలేదు" అని అన్నాడు. అప్పుడు ఆ మిత్రుడు అతనితో ఇలా చెప్పడం ప్రారంభించాడు.

"రోజులో ఒక మనిషికి ఉన్న 24 గంటల్లో నిద్రకు ఎనిమిది గంటలు, ఇక భోజనం చేయడం, తయారవడం, ప్రయాణం చేయడం ఇలా ఒక నాలుగు గంటలు మొత్తం 8+4=12 గంటలు పోయినా కూడా ఇక మిగిలిన 12 గంటల్లో సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయం మనం ఉద్యోగానికే కేటాయిస్తాం. అంటే మనం పూర్తి స్పృహలో ఉండి, పూర్తి శక్తితో మన సమయం కేటాయించేది మనం చేసే ఉద్యోగానికే. అలా మన జీవితంలో ముఖ్యమైన ఒక భాగం అంటే సుమారు 30 సంవత్సరాలు ఉద్యోగానికే కేటాయిస్తాం. మరి అలాంటి ఉద్యోగాన్ని మనం కేవలం జీతం తీసుకునే ఒక సాధనంగానే పరిగణిస్తే, చేసే పని యాంత్రికంగానే ఉంటుంది. అది కాలక్రమేణా మనలో మానసిక ఒత్తిడిని, అసంతృప్తి ని మాత్రమే మిగుల్చుతాయి.

సహజంగా మనం చేసే ప్రతీ పనిలో రెండు "H" లు ఉపయోగిస్తాం. ఒక H అంటే Head, మరో H అంటే Hand. అంటే మనం ఏ పని చేయాలో తెలుసుకుంటాం, ఆ పని చేయడానికి సిద్ధమవుతాం. కానీ ఆ పని చేయడం ద్వారా చేసిన మనకు ఒక సంతృప్తి కలగాలంటే మాత్రం మూడవ H కూడా తోడవ్వాలి. ఆ మూడవ H అంటే Heart.

అంటే మనం చేసే పని హృదయపూర్వకంగా చేస్తే మనలో ఎనలేని సంతోషాన్ని నింపుతుంది.

నీకు మరింత అర్థమయ్యేలా చెప్పాలి అంటే.. ఉపాధ్యాయులు అంటే ఎంతో తెలివి, ఆసక్తి, నైపుణ్యంతో సమాజాన్ని చైతన్యవంతం చేసే వాళ్ళు కాబట్టి సమాజంలో గౌరవమైన పాత్ర వారిది.

పాఠ్యపుస్తకం నేరుగా చదివితే విద్యార్థి కొంతమేరకు మాత్రమే అర్థం చేసుకోగలడు కానీ ఆ పాఠ్యపుస్తకం లోని అంశాన్ని ఉపాధ్యాయుడు తన నైపుణ్యాన్ని, అనుభవాన్ని జోడిస్తూ సులువుగా అర్థమయ్యేలా ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ, మరింత ఆసక్తి రేకెత్తించేలా చెప్పగలగడమే హృదయం జోడించడం అంటే.

గత సంవత్సరం ఈ పాఠం ఎలా బోధించామో ఈ సంవత్సరం కూడా అలాగే బోధిస్తే అది యాంత్రికంగా పని చేయడమే అవుతుంది. అలా కాకుండా ఈ సంవత్సరం అదే పాఠాన్ని మరింత సులువుగా అర్థమయ్యేలా, మరిన్ని ఉదాహరణలతో, వాస్తవ పరిస్థితులను ప్రస్తావిస్తూ, కాస్త హాస్యచతురతను జోడిస్తూ బోధించాలనే తపన ఉపాధ్యాయుల్లో ప్రతిరోజు ఒక సవాలుగా అనిపిస్తుంది. ప్రతి రోజు నూతనత్వం కనిపిస్తుంది. అలా మనసుపెట్టి చేసే పనిలో నాణ్యత దానంతట అదే మెరుగవుతుంది.

విద్యార్థులు ఎలాంటి స్వభావంతో ఉన్నా, పాఠశాల పరిస్థితులు ఎలా ఉన్నా అవి మన బోధనలో నైపుణ్యాన్ని తగ్గించేందుకు కారణాలు కాకూడదు కదా..

ఉద్యోగం అనేది మన వ్యక్తిత్వాన్ని, నైపుణ్యాన్ని సమాజానికి పరిచయం చేసే వేదిక. పనిని ఇష్టపడి, పూర్తి బాధ్యతతో నిర్వహించినప్పుడు విజయం, గుర్తింపు వాటంత అవే వస్తాయి.

పాఠం చెప్పడం పూర్తయ్యాక "ఈరోజు పిల్లలకు ఒక అంశాన్ని అర్థమయ్యేలా చెప్పగలిగాను" అనే సంతృప్తితో ఉపాధ్యాయుడు తరగతి గది బయటికి రాగలిగితే అలాంటి రోజులు అన్నీ కలిసి, ఉద్యోగ విరమణనాటికి ఆ ఉపాధ్యాయుడి జీవితం ఎన్నో సంతృప్తికరమైన జ్ఞాపకాలతో నిండిపోతుంది. జీవితంలో ఒక ముఖ్య భాగం అయిన ఉద్యోగాన్ని విజయవంతంగా నిర్వహించగలిగాను అనే ఆత్మస్థైర్యం కలుగుతుంది.

క్రికెట్ అనగానే మనకు సచిన్ టెండూల్కర్ గుర్తుకు రావచ్చు..మరి ఎంతోమంది క్రికెటర్లు ఉండగా అతనినే క్రికెట్ దేవుడుగా ఎందుకు పరిగణిస్తారు? 24 ఏళ్ళపాటు ఒకే నిలకడతో ఆడటం వల్లనే కదా.

తెలుగు సినిమా పాటలు పాడే గాయకులు చాలామంది ఉండగా బాలసుబ్రమణ్యం గారినే "గాన గంధర్వుడు"అని ఎందుకు అంటారు. భాష ఏదైనా భావాన్ని పలకడంలో ఆయన నైపుణ్యం, స్వరాల్ని మార్చడంలో ఆయన ప్రతిభ అసాధారణం కదా."

మిత్రుడి ద్వారా ఇదంతా విన్న ఆ ఉపాధ్యాయుడు మిగిలిన ఆ 4 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో పూర్తి నిబధ్ధతతో మనసు జోడించి సంతృప్తికర ఙ్ఞాపకాలు పోగేసుకుంటాను అని‌ మనసులో ధృడంగా అనుకుంటూ వెళ్ళిపోయాడు కృతఙ్ఞత చూపుతూ..

M. Jaya Krishna Reddy

M.S.(Counseling & Psychotherapy)

Motivational Speaker

Cell: 9640 21 55 41

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

మిగతా చదవండి →