Monday9 November 2026Hyderabad

SENSEX81,053+5.38%
NIFTY25,004+5.01%
HYD 22K₹1,32,435/10g+0.79%
Languages

Latest News

న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం అమలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

nagendra7 November 2026, 5:28 AM1 viewstrinetnews.com
న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం అమలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 06:

న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (NEHS) పథకం అమలులో ఉద్యోగులు, పెన్షనర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.

శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఎన్‌ఈహెచ్‌ఎస్ బోర్డు సమావేశంలో ఉన్నతాధికారులు, బోర్డు సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి పథకం అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు లేవనెత్తిన సమస్యలు, ముఖ్యంగా ఆసుపత్రుల్లో అడ్మిషన్లు, వైద్య చికిత్సలు, బిల్లుల చెల్లింపులు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం యశోద, అపోలో, కిమ్స్ తదితర కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో ఆన్‌లైన్ ద్వారా మాట్లాడిన ప్రధాన కార్యదర్శి, ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన ఫిర్యాదులపై ఆసుపత్రుల ప్రతినిధులను వివరణ కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌ఈహెచ్‌ఎస్ పరిధిలోని రోగులకు ఆసుపత్రుల్లో అడ్మిషన్లు నిరాకరించకూడదని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న పాత బిల్లులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, చికిత్సకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. వైద్య చికిత్సల ధరల్లో పారదర్శకత, ఏకరూపత ఉండేలా చర్యలు తీసుకోవాలని, ధరలను క్రమబద్ధీకరించడంతో పాటు జవాబుదారీతనాన్ని పెంపొందించాలని ఆదేశించారు. చికిత్సల ఛార్జీల విషయంలో సీజీహెచ్‌ఎస్ (CGHS) నిర్దేశించిన ధరలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బి.ఎం.డి. ఎక్కా, నవీన్ మిట్టల్, ముఖ్య కార్యదర్శులు క్రిస్టినా చోంగ్తు, యోగితా రాణా, శిఖా గోయల్, సర్ఫరాజ్ అహ్మద్, గౌరవ్ ఉప్పల్, శృతి ఓజా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ, ఇతర ఉన్నతాధికారులు, బోర్డు సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య