సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,053+5.38%
NIFTY25,004+5.01%
22K₹1,32,435/10g+0.79%
భాషలు

తాజా వార్తలు

రైతుల ఆదాయం పెంచి.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు

nagendra7 November 2026, 5:28 AM2 చూసులుtrinetnews.com
రైతుల ఆదాయం పెంచి.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

*- నవంబర్ 7 నుంచి 9 వరకు హకీంపేటలో మెగా రైతు మేళా

- 150 ప్రదర్శన స్టాళ్లు.. 10 జిల్లాల నుంచి 50 వేల మంది రైతుల హాజరు

- లగచర్లలో ఎకో పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన

- రైతులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా మెగా రైతు మేళా: మంత్రి తుమ్మల

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 6: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి, రైతుల ఆదాయాన్ని పెంచి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం హకీంపేటలో మూడు రోజుల పాటు మెగా రైతు మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. నవంబర్ 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ మేళా ప్రారంభం కానుందని తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులతో ముఖాముఖి చర్చలు జరపడమే కాకుండా పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమవుతారని వివరించారు. నవంబర్ 8న ముఖ్యమంత్రి హకీంపేటలో స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమవుతారని, అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. నవంబర్ 9న పది జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులు పాల్గొనే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం, వ్యవసాయంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను పరిచయం చేయడమే మెగా రైతు మేళా ప్రధాన ఉద్దేశమని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నామని తెలిపారు. మెగా రైతు మేళాలో ఏర్పాటు చేస్తున్న 150 ప్రదర్శన స్టాళ్ల ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్లు, నూతన సాగు పద్ధతులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యక్ష అవగాహన కలుగుతుందని మంత్రి తెలిపారు. శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చలు, ప్రగతిశీల రైతుల అనుభవాలు, విజయగాథలు ఇతర రైతులకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.

రైతుల ఆదాయం పెరగాలి.. వ్యవసాయం లాభసాటిగా మారాలి.. రైతు కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. సాగు ఖర్చులు తగ్గించి, రైతులు పండించిన పంటలకు మంచి ధర, విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన రైతు అభ్యున్నతి సాధ్యమవుతుందని అన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా మార్కెట్ డిమాండ్‌ను గుర్తించి పంటల వైవిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వం వేరుశనగ, పెసళ్లు, పొద్దుతిరుగుడు, మినుములు, శనగ వంటి విత్తనాలను సబ్సిడీపై అందచేస్తున్నట్టు తెలిపారు.

ప్రస్తుతం ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు వ్యవసాయ రంగానికి సవాళ్లు విసురుతున్నాయని, వర్షపాతం, నీటి లభ్యతలో వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేయాలని మంత్రి సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం, సాగు విధానాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని, ఈ విషయంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పాటించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. లగచర్ల పారిశ్రామిక కారిడార్‌లో ఎకో పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం ఆయిల్‌పామ్ రైతుల అభివృద్ధికి, రాష్ట్రంలో ప్రాసెసింగ్ పరిశ్రమల విస్తరణకు దోహదపడుతుందని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించే పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటైతే రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు లభించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని వివరించారు.

తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు తీసుకెళ్లి రైతులకు అధిక ఆదాయం అందించడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి స్పష్టం చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, వ్యవసాయం బలోపేతమైతేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని అన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని రైతులందరూ నవంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు హకీంపేటలో నిర్వహించే మెగా రైతు మేళాలో పెద్ద సంఖ్యలో పాల్గొని, ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని తెలుసుకుని, వాటిని తమ సాగులో ఆచరణలో పెట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

మిగతా చదవండి →