సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,080+5.41%
NIFTY24,996+4.98%
22K₹1,32,331/10g+0.73%
భాషలు

తాజా వార్తలు

పెట్టుబడులకు గ్లోబల్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే మా ప్రధాన ప్రాధాన్యత -మంత్రి శ్రీధర్ బాబు

nagendra7 November 2026, 4:56 AM0 చూసులుtrinetnews.com
పెట్టుబడులకు గ్లోబల్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే మా ప్రధాన ప్రాధాన్యత -మంత్రి శ్రీధర్ బాబు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

పెట్టుబడులకు అత్యంత అనుకూల ప్రాంతం మన హైదరాబాద్

గ్లోబల్ సమ్మిట్‌కు ప్రీ-సమ్మిట్ కార్యక్రమంగా ఇండియన్ రోడ్ కాంగ్రెస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణ కేంద్రంగా మారనుంది

- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో పికో టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 6: పికో టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని PICO ఫౌండర్ సీఈఓ జారోడ్ యస్టర్, ఐకో జి.సీతారాం, రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా, ప్రపంచ స్థాయి పారిశ్రామిక సంస్థలకు ఆకర్షణీయమైన కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకురావడంతో పాటు స్థానిక యువతకు నైపుణ్యానికి తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తెలంగాణ వైపు చూసేలా రాష్ట్రంలో అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారం అందిస్తూ పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని తెలిపారు. కొత్త సంస్థల రాకతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా యువతకు మెరుగైన భవిష్యత్తు అందుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా గ్లోబల్ సమ్మిట్ పాలసీని తీసుకొచ్చామని, రాష్ట్ర పెట్టుబడుల సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పేందుకు ఈ కార్యక్రమం కీలక వేదికగా నిలచిందని తెలిపారు. ఈ సారి డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు, పారిశ్రామిక దిగ్గజాలను తెలంగాణకు ఆహ్వానించి,రాష్ట్రంలో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను పరిచయం చేసి పెట్టుబడులను ఆహ్వానించనున్నట్టు తెలిపారు.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ

తెలంగాణను పెట్టుబడుల,

నూతన ఆవిష్కరణలకు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. హైదరాబాద్ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి ఐటీ,సాంకేతిక సంస్థలకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, ప్రపంచస్థాయి కంపెనీలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకు రావడం తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.

పికో టెక్నాలజీ ఇండియా వంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. ఇలాంటి సంస్థల రాకతో తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించడంతో పాటు సాంకేతిక రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని స్పష్టం చేశారు. పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, పెట్టుబడుల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి బాటలు పడతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు,అత్యాధునిక సాంకేతికతకు అంతర్జాతీయ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నదే మా ప్రభుత్వ అని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్‌కు ప్రీ-సమ్మిట్ కార్యక్రమంగా ఈ నెల 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారుల రంగానికి చెందిన నిపుణులు, ఇంజినీర్లు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

మిగతా చదవండి →