సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,053+5.38%
NIFTY25,004+5.01%
22K₹1,32,435/10g+0.79%
భాషలు

తాజా వార్తలు

మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్ల నిధులు మంజూరు

nagendra7 November 2026, 4:52 AM0 చూసులుtrinetnews.com
మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్ల నిధులు మంజూరు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 6:

మున్నూరు కాపు సామాజిక వర్గం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయడంపై ఆ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను పలువురు మున్నూరు కాపు సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మున్నూరు కాపు సామాజిక వర్గం ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. ఈ భవనం సామాజిక వర్గ ఐక్యతకు, అభివృద్ధికి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. తమ సామాజిక వర్గ అభ్యున్నతికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్‌ను శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు, గాలి అనిల్ కుమార్, కొలగాని మహేష్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య