సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,053+5.38%
NIFTY25,004+5.01%
22K₹1,32,435/10g+0.79%
భాషలు

తాజా వార్తలు

ఆటోమోటివ్, ఈవీ రంగాల్లో పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ కార్యాచరణ నవంబర్ 11న మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం

nagendra7 November 2026, 4:38 AM0 చూసులుtrinetnews.com
ఆటోమోటివ్, ఈవీ రంగాల్లో పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ కార్యాచరణ నవంబర్ 11న మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 6:

తెలంగాణ రాష్ట్రాన్ని ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) రంగాల్లో దేశంలోనే ప్రముఖ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026'ను విజయవంతం చేయడంతో పాటు, ఈ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.

ఇందులో భాగంగా ఆటోమోటివ్, ఈవీ రంగాలకు ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కౌన్సిల్‌లో ప్రముఖ ఆటోమొబైల్, ఈవీ కంపెనీల ప్రతినిధులు, పరిశ్రమల ప్రముఖులు, కీలక వాటాదారులకు స్థానం కల్పించారు. ఇప్పటికే సుమారు 25 మంది ప్రతినిధులు కౌన్సిల్‌లో భాగస్వాములయ్యేందుకు అంగీకారం తెలిపారు. ఈ క్రమంలో నవంబర్ 11న తెలంగాణ సచివాలయంలోని మినిస్టర్స్ కాన్ఫరెన్స్ హాల్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం నిర్వహించనున్నారు. హైబ్రిడ్ విధానంలో జరగనున్న ఈ సమావేశంలో పరిశ్రమల ప్రతినిధులతో ప్రభుత్వం నేరుగా చర్చించనుంది. తెలంగాణలో ఆటోమోటివ్, ఈవీ రంగాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు, కొత్త పెట్టుబడి ప్రతిపాదనలు, కంపెనీల విస్తరణ ప్రణాళికలు, భవిష్యత్ వ్యాపార అవకాశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ విధానాలు, ఎదురవుతున్న సమస్యలపై పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనున్నారు.

ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పోలో కంపెనీల భాగస్వామ్యంపై దృష్టి

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026తో పాటు నిర్వహించనున్న ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పోలో ప్రముఖ ఆటోమోటివ్, ఈవీ కంపెనీలు చురుగ్గా పాల్గొనేలా ఆహ్వానించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులను ఆకర్షించేలా ఈ రంగాలకు సంబంధించిన ప్రత్యేక చర్చా వేదికల అంశాలను కూడా ఖరారు చేయనున్నారు. ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి, తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సమన్వయం

సమావేశం విజయవంతంగా నిర్వహించేందుకు పరిశ్రమలు, వాణిజ్య శాఖకు చెందిన లాజిస్టిక్స్, సప్లై చైన్, ఆటోమోటివ్, ఈవీ విభాగం డైరెక్టర్ ఔజాద్ షేక్ సంబంధిత బృందాలతో సమన్వయం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐఅండ్ పీఆర్), పరిశ్రమల శాఖ మీడియా, కమ్యూనికేషన్స్ విభాగాలు సమావేశానికి విస్తృత ప్రచారం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆటోమోటివ్, ఈవీ రంగాల్లో ప్రపంచస్థాయి కంపెనీల పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడం, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేయడం, ఇప్పటికే ఉన్న సంస్థల విస్తరణకు ప్రోత్సాహం అందించడం ఈ కౌన్సిల్ ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో నవంబర్ 11న జరగనున్న తొలి సమావేశం రాష్ట్రంలో ఆటోమోటివ్, ఈవీ రంగాల భవిష్యత్ అభివృద్ధికి దిశానిర్దేశం చేయనుంది. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో ఈ రంగాలను కీలక పెట్టుబడి ఆకర్షణ కేంద్రాలుగా నిలబెట్టేందుకు ఈ సమావేశం కీలకంగా మారనుంది.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

మిగతా చదవండి →