Monday9 November 2026హైదరాబాద్

SENSEX81,076+5.41%
NIFTY24,997+4.98%
HYD 22K₹1,32,520/10g+0.82%
भाषाएँ

Latest News

యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఐదవ వార్షికోత్సవ వేడుకల్లో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

nagendra5 November 2026, 4:43 AM3 व्यूtrinetnews.com
యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఐదవ వార్షికోత్సవ వేడుకల్లో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

Share this story

Share link keeps your language (?lang=)

యాదాద్రి భువనగిరి, నవంబరు04/ట్రైనెట్ న్యూస్:

యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఐదవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడంతో పాటు నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కార్యవర్గ అధ్యక్షులుగా దేవరకొండ పోతులూరాచారి, ఉపాధ్యక్షులుగా కందుల అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా తరణి వీరాచారి, అధికార ప్రతినిధిగా కొల్లోజు సోమ నరసింహ చారి, కోశాధికారిగా జెల్లా జహంగీర్, ప్రచార కార్యదర్శిగా గుర్రం సంతోష్ కుమార్, సహాయ కార్యదర్శిగా బొడిగె లింగం గౌడ్ ఎన్నికయ్యారు. అదేవిధంగా అసోసియేషన్ సలహాదారులుగా రావులపల్లి బాలాచారి,పుర్మ శ్రీశైలం,ఆడెపు రఘురాములు, గుంటోజు శ్రీనివాసాచారి, తిప్పారపు మల్లేష్, తుడుం గణేష్‌లను ఎంపిక చేశారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు పలువురు కళాకారులు అభినందనలు తెలిపారు. జిల్లా కళాకారుల ఐక్యత, అభ్యున్నతి, సంక్షేమం కోసం నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు. కళాకారుల హక్కుల పరిరక్షణతో పాటు జిల్లాలోని కళాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి తగిన గుర్తింపు తీసుకురావాలని సూచించారు. కళాకారుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా నిలవాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.

यह भी पढ़ें

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

और पढ़ें →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య