సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,076+5.41%
NIFTY24,997+4.98%
22K₹1,32,520/10g+0.82%
భాషలు

తాజా వార్తలు

ఉపాధి హామీ పథకంలో తెలంగాణ ఆల్‌టైమ్ రికార్డు.. ఒకే రోజు 5 లక్షల మందికి పైగా కూలీలకు పని!

nagendra5 November 2026, 4:42 AM5 చూసులుtrinetnews.com
ఉపాధి హామీ పథకంలో తెలంగాణ ఆల్‌టైమ్ రికార్డు.. ఒకే రోజు 5 లక్షల మందికి పైగా కూలీలకు పని!

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 4:

తెలంగాణ రాష్ట్రం గ్రామీణ ఉపాధి కల్పనలో సరికొత్త చరిత్ర సృష్టించింది. వీబీజీ రామ్‌జీ ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. నవంబర్ 3న రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు ఐదు లక్షల మందికి పైగా కూలీలకు ఉపాధి కల్పించడం విశేషం. నవంబర్ నెలలో ఈ స్థాయిలో కూలీలకు ఒకే రోజున పని కల్పించడం ఇదే తొలిసారి కావడంతో గ్రామీణాభివృద్ధి రంగంలో తెలంగాణ మరో మైలురాయిని అధిగమించింది. గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, కూలీలకు నిరంతరం ఉపాధి అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఈ రికార్డుకు దోహదం చేశాయి. ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామీణ కూలీలకు ఆదాయం లభించడమే కాకుండా గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా అవకాశం కలుగుతోంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 3న సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రానున్న రోజుల్లో కూలీలకు మరిన్ని పనిదినాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మరింత విస్తరించి, ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

అలాగే నీటి వనరుల అభివృద్ధి, వర్షపు నీటిని ఒడిసిపట్టే పనులు, గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. ఉపాధి హామీ పనులు కేవలం కూలీలకు ఆదాయం కల్పించడానికే పరిమితం కాకుండా, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తుల సృష్టికి దోహదపడాలని పేర్కొన్నారు. కూలీలకు ఉపాధి కల్పన, జల సంరక్షణ, గ్రామాల్లో శాశ్వత ఆస్తుల నిర్మాణం.. ఈ మూడు అంశాలే ప్రధాన లక్ష్యాలుగా పనులు కొనసాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో స్థానిక పరిస్థితులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏడాది పొడవునా గ్రామీణ కూలీలకు పని లభించేలా సమగ్ర కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఒకవైపు గ్రామీణ పేదలకు ఉపాధి, మరోవైపు నీటి వనరుల సంరక్షణ, ఇంకోవైపు గ్రామాల అభివృద్ధి.. ఈ మూడు లక్ష్యాలను సమన్వయం చేస్తూ ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నవంబర్ 3న నమోదైన ఐదు లక్షల మందికి పైగా కూలీల ఉపాధి రికార్డు ఈ దిశగా తెలంగాణ సాధించిన కీలక విజయంగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య