న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 4:
మాదకద్రవ్యాల మహమ్మారి కారణంగా ఎన్నో కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయాయి. మరోవైపు పలువురు దారుణ హత్యలకు గురయ్యారు.
సుఖ్విందర్ సింగ్, గుర్మేల్ సింగ్‌లు హత్యకు గురయ్యారు. తన కుమారుడిని చిట్టా మత్తు నుంచి కాపాడేందుకు ప్రకాశ్ చంద్ తనకున్నదంతా అమ్ముకున్నారు. డ్రగ్స్ మహమ్మారి కారణంగా తెహల్ సింగ్ తన ఇద్దరు కుమారులను కోల్పోయారు.
ఈ బాధిత కుటుంబాలను నేడు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , లోక్‌సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ కలిసి వారి బాధలను పంచుకున్నారు. పంజాబ్ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఒక్కటే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రం నుంచి డ్రగ్స్ మహమ్మారిని, మాఫియా పాలనను పూర్తిగా నిర్మూలించి, పంజాబ్‌ను సుభిక్షంగా, అభివృద్ధి పథంలో నడిపిస్తాం.





