సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,053+5.38%
NIFTY25,004+5.01%
22K₹1,32,435/10g+0.79%
భాషలు

తాజా వార్తలు

వృద్ధులకు అండగా ‘వయో సమ్మాన్ రాష్ట్రీయ అభియాన్’ తరాల మధ్య అనుబంధమే లక్ష్యం.. కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ప్రారంభం

nagendra5 November 2026, 4:34 AM2 చూసులుtrinetnews.com
వృద్ధులకు అండగా ‘వయో సమ్మాన్ రాష్ట్రీయ అభియాన్’ తరాల మధ్య అనుబంధమే లక్ష్యం.. కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ప్రారంభం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

  • న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 04:

  • వృద్ధులు, యువత మధ్య అనుబంధాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ బుధవారం ‘వయో సమ్మాన్ రాష్ట్రీయ అభియాన్’ను ప్రారంభించారు. అటల్ వయో అభ్యుదయ యోజన కింద చేపట్టిన ఈ జాతీయ కార్యక్రమం ద్వారా వయోవృద్ధుల అనుభవం, విజ్ఞానాన్ని యువత శక్తితో అనుసంధానించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమ మార్గదర్శక పుస్తకాన్ని ఆవిష్కరించి, ‘వయో సాథీ’ స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. హాజరైన వారితో వయో సమ్మాన్ ప్రతిజ్ఞ చేయించారు.

వృద్ధులతో పరిచయం పెంచుకోవడం, సంభాషించడం, కలిసి కార్యక్రమాలు చేపట్టడం, సమాజానికి తోడ్పడడం, ఆ అనుబంధాన్ని నిరంతరం కొనసాగించడం అనే ‘5సీ’ విధానంలో అభియాన్ అమలవుతుంది. పంచాయతీలు, స్థానిక సంస్థలు, విద్యాసంస్థల సహకారంతో ప్రతి గ్రామం, ప్రతి బస్తీకి కార్యక్రమాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

దేశంలో 60 ఏళ్లు దాటిన వారి జనాభా 2011లో సుమారు 10 కోట్లు ఉండగా, 2036 నాటికి 23 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పట్టణీకరణ, వలసలు, కుటుంబ వ్యవస్థలో మార్పులతో తరాల మధ్య పరస్పర సంబంధాలు తగ్గుతున్నాయని అన్నారు. దీనివల్ల వృద్ధుల్లో ఒంటరితనం, సంక్షేమ పథకాలపై అవగాహన లోపం, సైబర్ మోసాల బారినపడే ప్రమాదం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు.

యువత వృద్ధులకు డిజిటల్ పరిజ్ఞానాన్ని అందిస్తే, పెద్దలు యువతకు జీవిత విలువలను నేర్పుతారని మంత్రి అన్నారు. ఈ దీపావళికి ఇంట్లోనూ, పరిసరాల్లోనూ ఏ వృద్ధుడూ ఒంటరిగా ఉండకుండా చూడాలని, వారి గౌరవార్థం ఒక దీపం వెలిగించాలని పిలుపునిచ్చారు. పెద్దలతో అరగంట గడపడం, వైద్యుడి వద్దకు తోడుగా వెళ్లడం వంటి చిన్న సహాయాలు కూడా వారి జీవితాల్లో ఎంతో మార్పు తీసుకొస్తాయని చెప్పారు.

అభియాన్‌లో ‘కలిసి 30 నిమిషాలు’, పరస్పరం నైపుణ్యాలు నేర్పుకోవడం, జీవిత అనుభవాలను పంచుకోవడం, డిజిటల్ అక్షరాస్యత, ఆరోగ్య పరిరక్షణ, వృద్ధులను మార్గదర్శకులుగా ప్రోత్సహించడం తదితర 12 అంశాలకు ప్రాధాన్యం కల్పించారు.

‘వయో సాథీ’ కార్యక్రమంలో 18 ఏళ్లు నిండిన పౌరులు స్వచ్ఛంద సేవకులుగా చేరవచ్చు. ఆసక్తిగల వారు ఎస్‌సీడబ్ల్యూ సమావేశ్ పోర్టల్ లేదా జీవన్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. వృద్ధులకు స్నేహితులుగా, సహాయకులుగా వ్యవహరించే వాలంటీర్లకు వయో సాథీ ధ్రువపత్రం అందజేయనున్నారు.

వృద్ధుల సమగ్ర సంక్షేమం కోసం శ్రీరామచంద్ర మిషన్, జోధ్‌పూర్‌లోని అధ్యాత్మ విజ్ఞాన్ సత్సంగ్ కేంద్రంతో రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ధ్యానం, యోగా, ఆరోగ్య కార్యక్రమాలతోపాటు తరాల మధ్య అనుబంధాన్ని పెంచే సామాజిక కార్యక్రమాలను ఈ సంస్థల సహకారంతో నిర్వహించనున్నారు. కార్యక్రమంలో శాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

మిగతా చదవండి →