Monday9 November 2026Hyderabad

SENSEX81,076+5.41%
NIFTY24,997+4.98%
HYD 22K₹1,32,520/10g+0.82%
Languages

Latest News

దీపావళి వేళ చిన్నారుల కంటి భద్రతపై అప్రమత్తంగా ఉండాలి బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తప్పనిసరి

nagendra5 November 2026, 4:21 AM0 viewstrinetnews.com
దీపావళి వేళ చిన్నారుల కంటి భద్రతపై అప్రమత్తంగా ఉండాలి బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తప్పనిసరి

Share this story

Share link keeps your language (?lang=)

నవంబర్ 4 నుంచి 14 వరకు చిన్నారులకు వాసన్ ఐ కేర్‌లో ఉచిత చికిత్స

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 4:

దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని వాసన్ ఐ కేర్ వైద్యులు సూచించారు. టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కళ్లకు తీవ్ర గాయాలై చూపు కోల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్ ఖాలీద్ లతీఫ్ , డాక్టర్ మరియా ఫారుకి , డాక్టర్ అంజలీ శుక్ల, డాక్టర్ కౌశిక్ హెచ్చరించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని హాస్పిటల్ లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ... బాణసంచా నుంచి వెలువడే నిప్పురవ్వలు కళ్లపై పడినప్పుడు వెంటనే శుభ్రమైన నీటితో కళ్లను కడిగి, ఆలస్యం చేయకుండా కంటి వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో పెద్దలు దగ్గరుండి పర్యవేక్షించాలని, ముఖానికి దగ్గరగా బాణసంచా కాల్చకుండా తగిన దూరం పాటించేలా చూడాలని తెలిపారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కంటికి శాశ్వత నష్టం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు. దీపావళి సందర్భంగా బాణసంచా ప్రమాదాలకు గురయ్యే చిన్నారులకు అండగా నిలిచేందుకు వాసన్ ఐ కేర్ ప్రత్యేక ఉచిత వైద్య సేవలను అందించనుంది. నాలుగు నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు హైదరాబాద్‌లోని అన్ని వాసన్ ఐ కేర్ ఆస్పత్రుల్లో నవంబర్ 4 నుంచి 14వ తేదీ వరకు ఉచితంగా చికిత్స అందించనున్నట్లు వైద్యులు తెలిపారు. కంటి గాయాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని చిన్నారుల కంటి ఆరోగ్యాన్ని కాపాడాలని వారు కోరారు.

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య