Monday9 November 2026Hyderabad

SENSEX81,076+5.41%
NIFTY24,997+4.98%
HYD 22K₹1,32,520/10g+0.82%
Languages

Latest News

సంగీతం, ఆటపాటలు, ఆత్మీయ పలకరింపులతో సీనియర్ల దీపావళి వేడుకలు

nagendra5 November 2026, 4:20 AM0 viewstrinetnews.com
సంగీతం, ఆటపాటలు, ఆత్మీయ పలకరింపులతో సీనియర్ల దీపావళి వేడుకలు

Share this story

Share link keeps your language (?lang=)

థానే, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 4:

లోకపురంలోని రీగల్ ప్లాజాలో ఉన్న ఎఫ్-టామ్ సెంటర్‌లో నవంబర్ 3న సీనియర్ సిటిజన్లు దీపావళి స్నేహ సమ్మేళనాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అల్పాహారం, బహుమతులు అందజేయడంతో పాటు భజనలు, పాటలు, ఆటపాటలతో సందడి చేశారు. తమ జీవితానుభవాలను పంచుకుంటూ కొత్త స్నేహాలను ఏర్పరచుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌బాబు గంజి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల అనుభవం సమాజానికి ఎంతో విలువైనదని, వారు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పుంగనూరు గోశాల, హస్లర్స్ హబ్, ఆనంద్ నిలయం వంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమాన్ని ప్రకాష్ కులకర్ణి, జోషి సర్ సమన్వయం చేశారు. పలువురు సీనియర్ సిటిజన్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎఫ్-టామ్ సెంటర్ ప్రతి మంగళవారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు సీనియర్ సిటిజన్లకు ఉచితంగా అందుబాటులో ఉంటుందని రాఘవ్ సర్ తెలిపారు.

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య