యాదాద్రి భువనగిరి, నవంబరు04/ట్రైనెట్ న్యూస్:
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకోతపల్లి గ్రామంలో పశువులకు నట్టల నివారణ మందులు అందించే కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గద్వాల ఉపేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్యురాలు డాక్టర్ ప్రత్యూష పాల్గొని, గ్రామంలోని పశుపోషకులు తమ పశువులకు సకాలంలో నట్టల నివారణ మందులు వేయించడంతో పాటు, అవసరమైన టీకాలు కూడా తప్పనిసరిగా వేయించాలని సూచించారు. పశువుల ఆరోగ్య పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాధుల నివారణపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా పశువుల ఆరోగ్య పరిరక్షణకు, పశుపోషకుల సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించారు.





